Site icon NTV Telugu

Prashant Kishor: బీజేపీ సొంతగా 370 సీట్లు సాధించలేదు..

Pk

Pk

Prashant Kishor: లోక్‌సభ ఎన్నికలు ముంచుకువస్తున్నాయి. వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈసారి బీజేపీనే స్వతహాగా 370 సీట్లను సాధిస్తుందని, ఎన్డీయే కూటమి 400కి మించి సీట్లను గెలుస్తుందని ప్రధాని మోడీతో పాటు కేంద్ర నాయకత్వం చెబుతోంది.

Read Also: Viral Video: సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడం కోసం ఏం చేస్తున్నాడో చూడండి.. వీడియో వైరల్

ఇదిలా ఉంటే ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 370 సీట్ల సంఖ్య కేవలం పార్టీ కార్యకర్తలకు బీజేపీ నిర్దేశించిన లక్ష్యం మాత్రమే అని అన్నారు. అయితే, ఇది బీజేపీకి ప్రతిష్టాత్మక లక్ష్యమని చెప్పారు. బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలువలేదని అన్నారు.

కాగా.. బీజేపీ 370 సీట్ల గెలుపుపై అమిత్ షా ఇటీవల వారి వ్యూహాన్ని ప్రకటించారు. ఆర్టికల్ 370ని తొలగించామని అందుకే తాము 370 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన ఆర్టికల్ 370ని 2019లో కేంద్రం తొలగించింది. భారత రాజ్యాంగం, చట్టాలు నేరుగా ఆ ప్రాంతానికి వర్తించేలా బీజేపీ మార్గం సుగమం చేసింది.

Exit mobile version