NTV Telugu Site icon

Prasanth Varma: ఆ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకున్న ప్రశాంత్ వర్మ..

Hanuman

Hanuman

దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు పాన్ ఇండియా టాపిక్‌ గా మారాడు. ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. వైవిధ్యమైన కథనాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో సినిమాలను చేస్తూ సినీ ప్రేమికులను మెప్పిస్తున్నాడు. హనుమాన్ చిత్రాన్ని మనందరం విజువల్ ఫీస్ట్‌ గా ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఒక చిన్న సినిమాతో 300 కోట్లు సంపాదించి ఈ రోజుల్లో 100 రోజులు సినిమా ఆడించి భారీ విజయం సాధించాడు.

Also Read: Happy Birthday Stick: కేక్ మీదకి ‘హ్యాపీ బర్త్ డే స్టిక్’ అడిగిన మహిళ.. చివరకు..

అందుకే ప్రశాంత్ వర్మ చేయబోయే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రేమికులు ఇప్పుడు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ చేతిలో దాదాపు 10 సినిమాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రశాంత్ వర్మ దర్శకుడే కాదు ప్రతిభావంతుడైన క్రికెటర్, డ్రమ్మర్ కూడా. ఇక ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. తాను చిన్నతనంలో సరస్వతీ శిశుమందిర్ స్కూల్‌ లో చదివానని., ఆ సరస్వతి శిశుమందిర్ విద్యాలయాలు భారతదేశంలోని అత్యుత్తమ పాఠశాలల్లో ఒకటని ఆయన తెలిపారు. అక్కడ విద్యతో పాటు మన ధర్మం, సంస్కృతి కూడా నేర్పుతారని తెలిపాడు.

Also Read: UP: దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై వేడి ఇనుప రాడ్తో..

తాజాగా, ప్రశాంత్ వర్మ ఓ వీడియోను షేర్ చేసి భావోద్వేగానికి గురయ్యాడు. సినిమా విడుదలకు ఒకరోజు ముందు తను చిన్నప్పుడు చదువుకున్న పాలకొల్లు శ్రీ సరస్వతీ శిశుమందిర్ వీడియో తనకి వచ్చిందని, ఈ వీడియో చూసి తనికి కళ్లల్లో నీళ్లు తిరిగాయని సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేస్తూ చెప్పుకొచ్చాడు. ఆ వీడియోను షేర్ చేస్తూ.. ఇప్పుడే షేర్ చేస్తున్న ఈ వీడియోలో తాను చదివిన పాఠశాలను చూపించి ప్రస్తుత విద్యార్థులతో కలిసి నేలపై కూర్చున్న విద్యార్థులతో హనుమాన్ వచ్చేలా, ఆ తర్వాత తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ స్కూల్ నుంచి అభినందనలు తెలుపుతూ ఓ వీడియో రావడంతో ప్రశాంత్ వర్మ ఎమోషనల్ అయ్యాడు.

Show comments