Site icon NTV Telugu

PVP Tweets: నీ బిల్డప్‌ ఏందయ్యా కేశినేని నాని.. అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అనుకుంటున్నావా..

Pvp Tweets

Pvp Tweets

PVP Tweets: విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ వి పొట్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేశినేని నానిపై మండిపడుతూ ఆయన చేసిన ట్వీట్ సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. నేరుగా కేశినేని నాని పేరును ప్రస్తావిస్తూ ఆయనకు పీవీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను చేసినంత అభివృద్ది దేశంలో ఏ ఎంపీ చేయలేదంటూ బుధవారం కేశినేని నాని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. దానికి పీవీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Read Also: AP CM Jagan: చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులే..

“కేశినేని నీ బిల్డప్ ఏంటి.. నువ్వేమన్నా అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అనుకుంటున్నావ.. ప్రజాసేవకు పుట్టాను అంటావ్‌.. దొబ్బేది బ్యాంకులను, యెగ్గొట్టేది కార్మికుల జీతాలు.. వెధవ సోది ఆపు.. ముందు కొవ్వు కరిగించుకో.. తర్వాత ఎన్నికల బరిలోకి దొర్లుకుంటూ రావచ్చు” అంటూ పీవీపీ విమర్శలు కురిపించారు. గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసి కేశినేని నానిపై ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉండగా.. విజయవాడ పార్లమెంట్‌కు వైసీపీ నుంచి ఇప్పటివరకు ఇంఛార్జ్‌గా ఎవరినీ నియమించలేదు. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత పీవీపీ వైసీపీకి దూరంగా ఉన్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? లేదా? అనేది అనుమానంగా ఉంది. ఇక టీడీపీ నుంచి అభ్యర్ధి ఎవరనే దానిపై కూడా పార్టీ వర్గాల్లో డైలమా నెలకొంది.

 

Exit mobile version