ప్రభాస్ సినిమాలో చెప్పినట్లు మనుషుల మధ్య బంధం, బంధుత్వాలు లేవు.. మానవత్వం కూడా కరువైంది.. కేవలం డబ్బు మోజులో పడి అన్ని వదిలేస్తున్నారు.. ఏదైనా ఫంక్షన్ లేదా పండుగలకు మాత్రమే ఒక్కటైయ్యే కుటుంబానికి గట్టిగా బుద్ది చెప్పాలని అనుకున్నాడు.. చివరికి చావు తో అది సాధించాడు.. చచ్చి ఏం సాధించాడు అనే సందేహం కలుగుతుంది కదూ.. అదేనండి చచ్చినట్లు నటించి బంధువులను ఒక చోటికి తీసుకొచ్చేశాడు.. తను చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు ఏర్పాటు చేయించాడు. అతని కుటుంబ సభ్యులంతా అక్కడికి వచ్చారు.. ఆ తరువాత ఏమైంది?.. అనేది ఈ ఆర్టికల్ లో చదవండి…
వివరాల్లోకి వెళితే.. 45 సంవత్సరాల డేవిడ్ బేర్టెన్ తను చనిపోయినట్లు నాటకం ఆడి కుటుంబాన్ని అంత్యక్రియల కోసం రప్పించాడు. అందుకోసం అతని కుమార్తెలతో పాటు పక్కా ప్రణాళికను రచించాడు. డేవిడ్ కుటుంబం లీజ్ సమీపంలో అంత్యక్రియలను ఏర్పాట్లు చేసింది. ఇక అతని కుటుంబసభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. డేవిడ్ అందర్నీ షాక్‌కి గురి చేస్తూ హెలికాప్టర్ నుంచి దిగాడు. అతడిని చూడగానే అప్పటివరకూ కన్నీరు పెట్టుకున్న వారంతా ఉలిక్కిపడ్డారు.. కొందరు అతను మనిషా, దెయ్యామా అని అతన్ని పట్టుకొని చూసారు.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఈ విషయం పై పలు మీడియా ఛానెల్స్ అతన్ని అడిగారు.. డేవిడ్ ను మీరెందుకు ఇలా ప్రాంక్ చేశారని అడిగితే తన కుటుంబం తనను ఏనాడు పట్టించుకోలేదని ఆ విషయంలో తనకి చాలా బాధ ఉందని చెప్పాడు. కుటుంబ సభ్యులంతా విడిపోయామని తనని దేనికి ఆహ్వానించరని.. ఎవరూ చూడటానికి కూడా రారని అందుకే వారు చేస్తున్న తప్పు తెలియచేయాలని ప్రాంక్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.. ఇక డేవిడ్ స్టంట్‌కి సంబంధించిన పూర్తి వీడియో అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడలేదు. ఈ దెబ్బతో అతని కుటుంబ సభ్యులకు బుద్ది వచ్చిందనే చెప్పాలి..