Prakash Raj : నాకు నేషనల్ అవార్డ్ వస్తే ఎవరూ పట్టించుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ అవార్డ్స్ గురించి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. 25 సంవత్సరాల క్రితం అంతఃపురం సినిమాకుగాను తనకు నేషనల్ అవార్డు వచ్చిందని, కానీ అప్పుడు తనను టాలీవుడ్ పెద్దలు ఎవరూ కూడా పట్టించుకోలేదని ప్రకాష్ రాజ్ అన్నారు.అల్లు అర్జున్ తో పాటు నేషనల్ అవార్డు వచ్చిన తెలుగు సినీ ప్రముఖులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల ప్రత్యేకంగా సన్మానించిన విషయం తెలిసిందే.. ఈ వేడుకలో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో ఎంతో హాట్ టాపిక్‌గా మారాయి.అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు రావడం అంటే తెలుగు వారందరికి ఎంతో గర్వకారణమని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇలాంటి సన్మాన వేడుకలకు తెలుగు హీరోలతో పాటు ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు కలిసిరావడం లేదని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అవార్డులు వస్తే ఒకరినొకరు ప్రశంసించుకోవడం మర్చిపోతున్నారని ఆయన అన్నారు..
మన ఇంట్లో వాళ్లని మనం గౌరవించుకోకపోతే అవతలి వాళ్లు మనల్ని ఎలా గౌరవిస్తారని ప్రకాష్ రాజ్ తెలిపారు ఇలాంటి వివక్ష ను భరించలేకే నేను చాలా రోజులుగా సినిమా వేడుకలకు దూరంగా ఉంటున్నానని, కానీ ఈ వేడుక గురించి మైత్రీ మూవీ మేకర్స్ చెప్పగానే వెంటనే వచ్చానని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ వేడుకకు సీనియర్లు కూడా దూరంగా ఉండటం బాధను కలిగిచిందని ఆయన తెలిపారు.మరోవైపు యంగ్ డైరెక్టర్లు రావడం ఎంతో ఆనందంగా అనిపించిందని ప్రకాష్ రాజ్ తెలిపారు..అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా గంగోత్రిలో తాను నటించానని, తనతో కలిసి నటించే సమయంలో ట్రైపాడ్ కెమెరా కింద కూర్చుని ఎంతో టెన్షన్ పడుతున్న అల్లుఅర్జున్ ని చూసిన ఆ క్షణాలు ఇంకా గుర్తున్నాయని ప్రకాష్ రాజ్ తెలిపారు, ఆ సమయంలో అల్లుఅర్జున్ కష్టపడాలనే తపన నేను చూసానని , అప్పుడే అతడు ఉన్నత స్థానానికి చేరుకుంటాడని నేను అనుకున్నానని ప్రకాష్ రాజ్ చెప్పాడు. నేషనల్ అవార్డ్‌తో నేటి యువతకు అల్లు అర్జున్ స్ఫూర్తిగా నిలిచాడని ప్రకాష్ రాజ్ తెలిపారు..బన్నీకి నేషనల్ అవార్డు వచ్చిందంటే నా కొడుకు వచ్చినంత ఆనందం ఉందని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..