Prakash Raj: “త్వరలో వస్తున్నా.. మీ అందరికీ సమాధానం చెస్తా”.. “శ్రీరాముడి” వివాదంపై ప్రకాష్ రాజ్ సంచలన స్టేట్‌మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Raj Controversy: శ్రీరాముడిపై వ్యాఖ్యల వివాదంలో ప్రకాష్‌రాజ్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరిచారని.. హిందూ ధర్మాన్ని, శ్రీరాముడిని వెటకారం చేశానని అంటున్నారని ఓ వీడియోలో పేర్కొన్నారు. అన్ని ధర్మాలను ప్రేమించే తనకు ఆ అవసరం లేదన్నారు. ధర్మాన్ని అడ్డుపెట్టుకుని మతోన్మాదంతో కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అలాంటి వారు తన ప్రశ్నలకు బదులివ్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను హిందూ వ్యతిరేకినని, ధర్మ విరోధినని నిందిస్తున్నారంటూ వెల్లడించారు. త్వరలో వస్తానని.. తనపై నిందలు వేస్తున్న వారికి సమాధానం చెప్తా అని ప్రకాష్‌రాజ్ స్పష్టం చేశారు.
READ MORE: Israel: చైనా, పాకిస్థాన్ ఇజ్జత్ తీసిన ఇజ్రాయెల్.. ఇరాన్‌కు ఎంత ‘చెక్కు’ ఇచ్చారని సూటి ప్రశ్న!
Also Read
- WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
ఇక నటుడు ప్రకాష్ రాజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాల్లో అనేక పాత్రల్లో నటించారయన. సినిమాల్లో క్యారెక్టర్లు వేరు. బయట ప్రకాష్ రాజ్ తీరు వేరేగా ఉంటుంది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారుతున్నారాయన. ఇటీవల కేరళలో జరిగిన ఓ సాహిత్య ఉత్సవంలో ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ.. శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీలుగా అభివర్ణించారు. వారు దక్షిణాదిలో ఓ గిరిజనుడైన రావణుడి పొలంలోకి వెళ్లి పండ్లు దొంగిలించారని, ఆ విషయంలోనే వివాదం మొదలైందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పండ్ల దొంగతనం వల్లే యుద్ధం జరిగిందన్నారు. ఇక ప్రకాష్ రాజ్ శ్రీరాముడిపై చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ (VHP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందూ సమాజానికి ప్రకాష్ రాజ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వస్తున్నా.. అందరి లెక్క తేలుస్తా అని వివరణ ఇచ్చారు.
To all the desperate bigots #justasking pic.twitter.com/zGLpbEOcYp
— Prakash Raj (@prakashraaj) April 19, 2026
తాజావార్తలు
-
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
-
Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
-
WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!