NTV Telugu Site icon

KA Paul : రెచ్చగొడితే రెచ్చిపోవద్దు.. నేనున్నాను

Ka Paul

Ka Paul

KA Paul : కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ ఎనిమిది గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగారు. ఈ గొడవలో తన భూమి పోతుందేమోనన్న భయంతో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కామారెడ్డి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. మాస్టార్ ప్లాన్ విషయంపై కామారెడ్డి కలెక్టర్ ని కలిసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. భూములు పోతాయని ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. అవసరముంటే రైతుల తరపున తాను పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని కలెక్టర్ ని కోరానన్నారు. రైతులకు వ్యతిరేకంగా మాస్టర్ ప్లాన్ ఉండబోదని, ఈమేరకు తాను కూడా హామీ ఇస్తున్నానని అన్నారు. ఎవరో రెచ్చగొట్టారని రెచ్చిపోవద్దని సూచించారు. పది రోజుల్లో రైతులకు అనుకూలంగా ప్రకటన వెలువడకపోతే తానే ధర్నాకు కూర్చుంటానని చెప్పారు.

Read Also: Constable Love Affair : ఫ్రెండ్ షిప్.. లవ్.. రూమ్.. ప్రెగ్నెంట్ కాగానే ప్లాన్ రివర్స్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మూడో రోజు రైతుల ఆందోళన కొనసాగుతోంది. శుక్రవారం రైతులపై దాడికి నిరసనగా కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన చేపట్టారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటనపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తతతో రేవంత్ రెడ్డి పర్యటన డైలమా లో ఉంది. మరోవైపు జిల్లా కలెక్టర్ తీరుపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటి వరకు రైతులను కలెక్టర్ కలవలేదు.  కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా తనకు నష్టం జరుగుతుందన్న ఆందోళనతో సదాశివనగర్​మండలం అడ్లూర్​ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాములు కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించారు. మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు.