NTV Telugu Site icon

Praja Palana Applications 2023: నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన అప్లికేషన్లు ప్రారంభం

Prajapalana

Prajapalana

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలనకు నేటి నుంచి శ్రీకారం చూడుతుంది. ఇవాళ్టి నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 12, 769 పంచాయితీలు, 3, 626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16, 395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు జరగనున్నాయి. ఈ కార్యక్రమం కోసం 3,714 అధికార బృందాలను ప్రభుత్వం రెడీ చేసింది. సుమారు పది శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం రోజుకు రెండు గ్రామాలు లేదా రెండు వార్డుల్లో పర్యటించి ప్రజా సదస్సులు నిర్వహించనుంది.

Read Also: Astrology: డిసెంబర్‌ 28, గురువారం దినఫలాలు

ఈనెల 31, జనవరి 1 సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు గ్రామ, వార్డు సభలు ఉండనున్నాయి. ఈ సభల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం అందులోనే వివరాలు అధికారులకు సమర్పించాలి. ఇంటి యజమాని పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబరు, వృత్తి, చిరునామా, కుటుంబ సభ్యులందరి వివరాల లాంటి పది అంశాలను పూర్తి చేయాలి.. ఆ తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాల్లో దేనికి దరఖాస్తు చేస్తున్నారో వాటికి టిక్ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఫాంలో పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ ప్రతిని జత పరిచి వివరాలన్నీ వాస్తవమేనని ధ్రువీకరిస్తూ సంతకం చేయాలి అని అధికారులు సూచిస్తున్నారు.

Read Also: Health Tips : త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

ఇక, దరఖాస్తుల ద్వారా అందిన సమాచారం ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే, ప్రజాపాలన కార్యక్రమం అమలు కోసం ప్రభుత్వం సుమారు 22 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. గ్రామ, వార్డు సభల్లో మంచినీరు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లు తదితర సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. వంద కుటుంబాలకు ఒక కౌంటరు ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువగా ఉంటే టోకెన్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. ప్రజా పాలనను ప్రతీ నాలుగు నెలలకోసారి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Read Also: Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే?

అయితే, రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతిపత్రాలు, ఫిర్యాదులను సమర్పించవచ్చునని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తు చేయలేకపోయిన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. ఆ తర్వాత పంచాయతీలు, మండల కార్యాలయాల్లోనూ ఇవ్వొచ్చని పేర్కొనింది. దరఖాస్తుదారులే గ్రామసభకు వెళ్లాల్సిన అవసరం లేదు.. వారి తరఫున ఎవరైనా దరఖాస్తు ఇవ్వొచ్చు అని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతీ జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతికుమారి సూచించారు.

అలాగే, గ్రామ సభలు ఉదయం 8 గంటలకే ప్రారంభమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలబి సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై రాత్రి జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పురపాలక శాఖ కమీషనర్ హరిచందన, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ అశోక్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Show comments