NTV Telugu Site icon

Praja Galam: చిలకలూరిపేటలో ప్రజాగళం సభ.. మోడీ ప్రసంగంపైనే సర్వత్రా ఆసక్తి

Prajagalam

Prajagalam

Praja Galam: ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కూడా కుదిరింది. సీట్ల షేరింగ్ కూడా ఇప్పటికే పూర్తియింది. ఇప్పటికే టీడీపీ రెండు జాబితాలను విడుదల చేసింది. జనసేన ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాల్లో కూడ జనసేన అభ్యర్థులను ప్రకటించనుంది. బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత తొలిసారిగా ఈ సభ నిర్వహిస్తున్నారు.ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. సా.5గంటలకు చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం సభలో ప్రధాని పాల్గొననున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ప్రజాగళం సభ జరగనుంది. ఏపీ పర్యటనకు వెళ్తున్నానంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్‌తో కలిసి సభలో ప్రసంగిస్తానంటూ.. ఏపీ ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్డీఏ కోరుకుంటోందంటూ మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి పవన్‌ కల్యాణ్‌ చేరుకున్నారు.. పదేళ్ల తర్వాత ఒకే వేదికపై మోడీ, చంద్రబాబు, పవన్‌ కలుసుకోనున్నారు.

Read Also: Lok Sabha Election : కాంగ్రెస్ 25హామీలు.. మేనిఫెస్టో వచ్చేది అప్పుడే : జైరాం రమేష్

2014 ఎన్నికల సభలో నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. 2019 ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ నుండి టీడీపీ వైదొలిగింది. జనసేన కూడా టీడీపీతో తెగదెంపులు చేసుకుంది. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి ఈ మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఐ(ఎం)తో కలిసి పోటీ చేయనుంది. చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం సభలో ఈ మూడు పార్టీల నేతలు ఏం చెబుతారనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. ప్రధానంగా ప్రధాని మోడీ ఏపీకి ఏం హామీలు ఇవ్వబోతున్నారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏం మాట్లాడబోతున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ సభలో ప్రధానమంత్రి మోడీ పాల్గొంటున్నందున బందోబస్తు ఏర్పాట్లను కూడా ఎస్‌పీజీ అధికారులు పర్యవేక్షించారు. ఎస్పీజీ అధికారులు. స్థానిక పోలీసులతో భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు.

4:10కి ప్రధాని మోడీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బీబీజే ఫ్లైట్‌లో గన్నవరానికి మోడీ రానున్నారు. గన్నవరం నుంచి 4:15 కు బయలుదేరి 4:55కు పల్నాడుకు హెలికాప్టర్‌లో చేరుకోనున్నారు. పల్నాడు హెలీపాడ్ వద్ద నుంచి బొప్పూడి సభా ప్రాంగణానికి సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. సభలో పాల్గొన్న అనంతరం తిరిగి 6.15కు హెలికాప్టర్‌లో 6.55కు గన్నవరం చేరుకోనున్నారు. 7 గంటలకు గన్నవరం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు 7.45 గంటలకు చేరుకోనున్నారు.