NTV Telugu Site icon

Prahladsingh Patel: పోలవరం అంచనాలపై త్వరలో నిర్ణయం

Prahlad

Prahlad

ఏపీ ప్రజలకు జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం తన వైఖరి వెల్లడిస్తూనే వుంది. పోలవరం ప్రాజెక్టు 2013 -14 లో అంచనాలకు మేము అంగీకారం తెలిపాం. ఇప్పుడు అంచనా వ్యయం పెరిగింది.. పెరిగిన అంచనాలపై ఒక కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు కేంద్ర జల శక్తి, సహాయ మంత్రి.. ప్రహ్లాద్ సింగ్ పటేల్.

దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ కి అరవై వేల కోట్లు కేటాయించాం. ఈ మిషన్లో 60 శాతం కేంద్రం 40 శాతం రాష్ట్రం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ లో 95 లక్షల ఇళ్లకు టార్గెట్ గా ఉందన్నారు. ఇప్పటికే 54 లక్షల ఇళ్లకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశామన్నారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. 2024 నాటికి ప్రతి ఇంటికీ జలజీవన మిషన్ ద్వారా నీరు అందించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

Read Also: Jagadish Reddy : విద్యతో మనిషి జీవితంలో వెలుగులు నింపొచ్చు

రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు, 13 వేలకోట్లు పైబడి కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నిధులు ఇచ్చింది. పోలవరానికి అన్ని విధాల సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు కేంద్రమంత్రి. పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం కేవలం థర్డ్ పార్టీ గానే ఉంటుందన్నారు. మెగా ఫుడ్ పార్క్ స్థానంలో, మినీ ఫుడ్ పార్క్ తీసుకొస్తున్నాం. ప్రతి యూనిట్ కి 10 లక్షలు లోన్ ఇస్తాo.35శాతం సబ్సిడీ కూడా ఇస్తున్నాం అన్నారు.