Site icon NTV Telugu

Rajni – Kamal : రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ డైరెక్షన్ పై ప్రదీప్ రంగనాధ్ షాకింగ్ కామెంట్స్

Pradeep Ranganath

Pradeep Ranganath

కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా కమల్ హాసన్ దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్ కార్యక్రమంలో కన్ఫామ్ చేసాడు.

అయితే ఈ సినిమాను తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ తెరకెక్కించడం లేదని ఇటీవల వార్తలు వినిపించాయి.  లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు కథ మాత్రమే అందిస్తాడని ఆ కథతో తమిళ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగరనాధ్ దర్శకత్వంలో రజనీకాంత్ – కమల్ హాసన్ సినిమా చేస్తారని తమిళ సినీ మీడియా కోడై కూసింది. కానీ అధికారకంగా ప్రకటన రాలేదు. తాజాగా ఈ వార్తలపై స్పందించాడు ఈ హీరో కమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాధ్. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ నేను సూపర్ స్టార్ కు బిగ్ ఫ్యాన్. ఆయన సినిమా ఏది నెను ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవను. అలాగే రజనీ – కమల్ సినిమాను నేను డైరెక్ట్ చేయడం లేదు. నేను ప్రస్తుతం నటనపై మాత్రమే దృష్టి పెట్టాను. అసలు రజనీ – కమల్ సినిమా డైరెక్షన్ కోసం నాకు ఆఫర్ వస్తుందో లేదో నేను ఇప్పుడే చెప్పలేను” అని క్లారిటీ ఇచ్చేసాడు.

Exit mobile version