Site icon NTV Telugu

Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్‌కి సవాల్ గా మారిన ‘LIK’ !

Pradeep Ranganathan

Pradeep Ranganathan

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ప్రదీప్‌లో టెన్షన్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే నిజానికి ఈ సినిమా ఆయన కెరీర్‌లో రెండో చిత్రంగానే పట్టాలెక్కింది, కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. దీనికంటే ముందు ప్రదీప్ నటించిన సినిమాలు 100 కోట్ల మార్కును సునాయాసంగా దాటేశాయి. ఇప్పుడు అదే బాక్సాఫీస్ టార్గెట్ ఈ సినిమాపై కూడా ఉండటంతో, అది తనపై ఒక పెద్ద ఛాలెంజ్ లా ఉందని ప్రదీప్ స్వయంగా అంగీకరించాడు.

అయితే ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ ఇప్పుడు థియేటర్లలోకి వస్తుండటంతో, నేటి ట్రెండ్ కి ఈ కథ ఎంతవరకు సింక్ అవుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ విఘ్నేష్ శివన్ మేకింగ్, అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పాలి. కృతి శెట్టికి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ప్రదీప్ తన సహజమైన నటనతో యువతను ఆకట్టుకోవడంలో దిట్ట. మరి 100 కోట్ల ప్రెజర్‌ను అధిగమించి, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తో ప్రదీప్ హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి. ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

Exit mobile version