‘కోమాలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే సత్తా చాటిన ప్రదీప్ రంగనాథన్, ఆ తర్వాత ‘లవ్ టుడే’తో హీరోగా మారి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్లు అందుకున్న ప్రదీప్.. ఇప్పటివరకు అపజయం అనేదే తెలియని క్రేజీ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రదీప్ తన తదుపరి చిత్రం కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టబోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా నటిస్తూనే స్వయంగా దర్శకత్వం వహించబోతున్న ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న అప్‌డేట్స్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
Also Read : Nagarjuna: తాత కాబోతున్న కింగ్ నాగార్జున?
ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ కొత్త చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ ఒక ఆసక్తికరమైన సైన్స్ ఫిక్షన్ కథను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ‘లవ్ టుడే’లో యూత్‌ఫుల్ ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించిన ప్రదీప్, ఈసారి సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తన మార్క్ టేకింగ్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న తరుణంలో, మళ్ళీ స్వీయ దర్శకత్వంలో వస్తుండటంతో ఇది ప్రేక్షకులకు ఖచ్చితంగా డబుల్ ట్రీట్ కానుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మరియు మరిన్ని వివరాలు కొద్ది రోజుల్లోనే వెలువడే అవకాశం ఉంది.
