తెలుగు బుల్లి తెర పై తనదైన శైలి లో ఎంతగానో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ ప్రదీప్. నిత్యం పలు టీవి షోస్ తో బిజీ గా వుండే ఆయన ప్రస్తుతం కొన్ని షోస్ మాత్రమే చేస్తున్నాడు. టెలివిజన్ రంగంలో ఆయనకు వున్న ఇమేజ్ కి వరుస షోస్ చేసే అవకాశం చాలా ఉంది. ఆయన సిద్దపడితే పలు చానల్స్ కొత్త కార్యక్రమాలు చేసేందుకు సిద్ధం గా ఉన్నాయి.. కానీ యాంకర్ ప్రదీప్ మాత్రం ఒక డాన్స్ షో ఇంకా మరో ఇతర షో లో మాత్రమే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.. యాంకర్ రవి వరుస టీవీ షోస్ తో దూసుకు పోతున్నా కూడా ప్రదీప్ మాత్రం చాలా తక్కువ షోస్ చేస్తున్నాడు.అయితే ప్రదీప్ చాలా తక్కువ షోస్ చేయడానికి కారణం ఆయన హీరో గా ఒక సినిమాను చేయబోతున్నాడని సమాచారం..
యాంకర్ ప్రదీప్ గతం లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తో ప్రేక్షకులని పలకరించాడు . అయితే ఆ సినిమా హీరో గా ప్రదీప్ కి సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.అందుకే కొద్ది గా గ్యాప్ తీసుకొని హీరో గా రెండో సినిమా ను చేసేందుకు ప్రదీప్ సిద్ధం అవుతున్నాడు.. ఈ గ్యాప్ లో ఆయన ఎన్నో కథ లను విన్నారు. అయితే ప్రదీప్ ఎట్టకేలకు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా ను చేసేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా ను నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.. ఇక ఒక సినిమా ను ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం… అతి త్వరలోనే యాంకర్ ప్రదీప్ రెండవ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం.అలాగే తన రెండో సినిమాకు సంబంధించి ఇతర నటినటుల వివరాలు కూడా త్వరలోనే తెలియజేయనున్నట్లు సమాచారం