సినీ పరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకుంది. తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జూన్ 12, బుధవారం తమిళనాడులోని పల్లవాకంలోని తన గదిలో అతను విగతజీవిగా కనిపించాడు. గత రెండు రోజులుగా ప్రదీప్‌కు అతని స్నేహితుల నుండి కాల్స్ వస్తున్నాయి. కాని., కాల్ చేసిన కానీ అయన స్పందించలేదు. అయితే అనుమానం వచ్చిన ఓ స్నేహితుడు అతడి ఇంటి దెగ్గరికి వెళ్లి పలు మార్లు తలుపును తట్టాడు. ఆ సమయంలో బయట వాకిలి లోపలి నుండి గడియ పెట్టి ఉంది.
Indian Coast Guard Recruitment: ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వనం
దాంతో ఏం చేయాలనీ ఆలోచించిన అతడు వెంటనే విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి తెలిపేసు. దాంతో పోలీసులు ఇంటి వాకిలిని పగులకొట్టి ఇంటికి లోపలికి వెళ్లి చూడగా అతడు శవమై కనిపించాడు. నటుడు గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ATM Withdrawal Charges: అలర్ట్.. భారీగా పెరగనున్న క్యాష్ విత్‌డ్రా ఛార్జీలు..
మరోవైపు., ప్రదీప్ “తగిడి” సినిమాతో పాపులర్ అయ్యాడు. అతను చాలా చిత్రాలలో విలన్ గా, హాస్యనటుడిగా కనిపించాడు. అతను ‘టెడ్డీ’, ‘ఇరుంబు తిలై’, ‘తమిళోకు ఎన్ ఒండ్రై అరథూమ్’, ‘లిఫ్ట్’, ‘మనం’, ‘క్లబ్ కెన్నెడీ’, ‘ఆడై’ వంటి అనేక తమిళ చిత్రాలలో నటించాడు. ఇక చివరిగా లారెన్స్ నటించిన ‘రుద్రన్’లో నటించాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.