Marurthi: ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు మేకర్స్. సినిమాకు అయితే మిక్స్‌డ్ టాక్ వచ్చింది, కానీ మొదటి రోజు 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సినిమా టీం ప్రకటించడమే కాదు, ఒక థాంక్యూ మీట్ కూడా నిర్వహించింది.
READ ALSO: Drunk and Driving: జర్రుంటే సచ్చిపోతుండేగా.. కారుతో తాగుబోతు బీభత్సం..!
ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చిన మారుతి మాట్లాడుతూ.. “ప్రభాస్ గారి ఫ్యాన్స్ తనకు, ‘మా అన్న సినిమాకి ఫస్ట్ ఇలానే ఉంటుంది, మీరు అసలు అలాంటివన్నీ పట్టించుకోవద్దు, పది రోజుల తర్వాత అన్న స్టామినా చూడండి’ అని నాకు మెసేజ్లు చేస్తున్నారు. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే, ఒక నార్మల్ మిడ్-రేంజ్ డైరెక్టర్‌కి ప్రభాస్ సినిమా తీశాడు అనిపించేలా చేసిన ప్రభాస్ గారికి చాలా చాలా థాంక్స్. మా ఫ్రెండ్ బన్నీ వాసు కూడా నిన్న పొద్దున ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు. దయచేసి నేను ఏమన్నా బాధ పడిపోతున్నాను అనుకోవద్దు” అని అన్నారు.
అలాగే విమల్ థియేటర్ దగ్గర పరిస్థితి గురించి తనకు తెలియదని, ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు ఇబ్బంది పడినట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. “రాత్రి ఒంటి గంటకి సినిమా మొదలైందని, నిద్రపోవాల్సిన సమయంలో మైండ్ గేమ్ చూపించామని” అన్నారు. తర్వాత నాలుగున్నరకి ఆ రిజల్ట్ ఎలా ఉందో కూడా తమకు అర్థమైందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
READ ALSO: Couple Relationship: భార్యాభర్తల మధ్య దూరానికి కారణం అయ్యే విషయాలు ఇవే..
