Site icon NTV Telugu

Darling : ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్.. అనౌన్స్‌మెంట్‌ రెడీ

Prabhas

Prabhas

రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ లో మనోడు చేస్తున్న సినిమాలు మరే ఇతర స్టార్ హీరోలు చేయడంలేదని చెప్పడంలో సందేహమే లేదు. ప్రస్తుతం మారుతీ డైరెక్షన్ లో రాజాసాబ్ చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఇక మరొక టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోను ఓ సినిమా చేస్తున్నాడు అనే టాక్ ఉంది.

ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరుమీదున్నాడు ప్రభాస్. తాజాగా రెబల్ స్టార్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాచోరే నాచోరే తో పాటు నాటు నాటు వంటి ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ను కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ లో బెస్ట్ డాన్స్ మాస్టర్ గా కొనసాగుతున్నారు. రాజమౌళి సినిమాలలోని ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కు డాన్స్ కొరియోగ్రఫీ చేసాడు ప్రేమ్ రక్షిత్. ఇన్నాళ్లుగా డాన్స్ మాస్టర్ గా కొనసాగిన ప్రేమ్ రక్షిత్ ఇప్పుడు మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ నేపధ్యంలోనే ఓ పవర్ఫుల్ కథను రెడీ చేసి రెబల్ స్టార్ ప్రభాస్ కు వినిపించాడు. మాస్టర్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు డార్లింగ్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నాడు డెబ్యూ డైరెక్టర్ ప్రేమ్ రక్షిత్.

Exit mobile version