NTV Telugu Site icon

Sri Prabhas: ప్రభాస్ కాదు.. ఇక నుంచి ‘శ్రీ’ ప్రభాస్!

Sri Prabhas

Sri Prabhas

Prabhas Have a New Tag in Kalki 2898 AD Movie: భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలను, భవిష్యత్‌ను కలుపుతూ.. ప్రభాస్‌ హీరోగా, నాగ్ అశ్విన్‌ రూపొందించిన ఈ మూవీపై ముందునుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు, ట్రైలర్లు ఆ అంచనాలను మరింత పెంచాయి. నేడు (జూన్‌ 27) కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తవగా.. పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాతో ప్రభాస్ పేరు మారిపోయింది.

ప్రభాస్‌కు ‘రెబల్ స్టార్’ అనే ట్యాగ్ లైన్ ఉన్న విషయం తెలిసిందే. గత సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్‌ అని టైటిల్స్ సమయంలో పడేది. కానీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్‌ అని కాకుండా.. ‘శ్రీ’ ప్రభాస్ అని వేశారు. ఇకనుంచి రెబల్ స్టార్ ప్రభాస్‌ కాకుండా.. శ్రీ ప్రభాస్ అని పడనుంది. ప్రభాస్‌ను అతడి ఫాన్స్ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. ఇటీవలే సలార్‌తో భారీ హిట్ కొట్టిన ప్రభాస్‌ ఖాతాలో కల్కితో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టే.

Show comments