Spirit: స్పిరిట్ సినిమాపై అనంత శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్.. ప్రభాస్‌ను అలా చూస్తారంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలోని పాటలు, ప్రభాస్ పాత్ర స్వభావం గురించి అనంత శ్రీరామ్ ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ‘స్పిరిట్’ మూవీ ఆల్బమ్ చాలా వైవిధ్యంగా ఉండబోతోందని.. సాధారణంగా ప్రభాస్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాల్లో భారీ డప్పులు, మాస్ బీట్స్ ఆశిస్తారు. కానీ, ఈ చిత్రంలో పాటలు మాత్రం చాలా క్లాసిక్ టచ్‌తో, మెలోడియస్ గా ఉంటాయని ఆయన తెలిపారు. ఇప్పటికే రెండు పాటల రచన పూర్తయిందని, మూడవ పాటపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. ఒక మంచి సాహిత్య విలువలున్న ఆల్బమ్‌ను సంగీత ప్రియులు వినబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేవలం పాటలే కాదు, సినిమాలోని యాక్షన్ ఘట్టాల గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. పాటలు క్లాస్‌గా ఉన్నప్పటికీ, సినిమాలో మాత్రం ప్రేక్షకులకు కావాల్సిన యాక్షన్, ఊచకోత పుష్కలంగా ఉంటాయని స్పష్టం చేశారు. అంటే.. సందీప్ రెడ్డి వంగా మార్క్ ‘వైలెన్స్’ ఈ సినిమాలో కూడా గట్టిగానే ఉండబోతోందని అర్థమవుతోంది. ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నందున.. ఆయన మాస్ మేనరిజమ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని తెలుస్తోంది.
Also Read
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- RCB Player: ‘ఐపీఎల్‌లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
Also Read:Rohit Sharma : ధోనీ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్‌లో ‘హిట్‌మ్యాన్’ సరికొత్త చరిత్ర!
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం, ప్రభాస్ హీరోగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ నటి తృప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తుండగా.. టి-సిరీస్ , భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి అనంత శ్రీరామ్ వ్యాఖ్యలతో ‘స్పిరిట్’ చిత్రం ఒక వైపు క్లాసిక్ మ్యూజిక్, మరోవైపు యాక్షన్‌తో ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్‌లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!