Spirit : స్పిరిట్‌లో బోల్డ్ బ్యూటీ .. స్పెషల్ సాంగ్‌తో పాటు కీలక పాత్ర !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలతో తన మార్క్‌ను నిలబెట్టుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను పవర్‌ఫుల్ కాప్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రుప్తి దిమ్రిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం, ఈ సినిమాలో స్పేషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ హుమా ఖురేషిను తీసుకున్నారని తెలుస్తోంది. కేవలం స్పెషల్ సాంగ్‌కే కాకుండా హుమా సినిమాలో ఒక చిన్న పాత్రలో కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కథలో ఒక ట్విస్ట్ లేదా కీలక మలుపును సృష్టించే అవకాశం ఉందని టాక్.
Also Read : Trivikram Venkatesh 1 : త్రివిక్రమ్-వెంకీ మూవీ పై మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ వైరల్..?
Also Read
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
ఇక యూనిట్ రాబోయే షెడ్యూల్‌లో భారీ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించడానికి రెడీ అవుతోంది. ఈ ఫైట్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ముఖ్యంగా ఒక పెద్ద యాక్షన్ బ్లాక్ మొత్తం ‘స్పిరిట్’ కథనానికి టర్నింగ్ పాయింట్‌గా నిలవనుందని, ఆ సీన్‌లో ప్రభాస్ పవర్‌ని సందీప్ పూర్తిగా ఎలివేట్ చేయనున్నారట. మ్యూజిక్ విషయంలో కూడా టీమ్ ఏ మాత్రం రాజీ పడలేదు. ‘అనిమల్’కు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే హర్షవర్ధన్–సందీప్ రెడ్డి వంగా కలిసి అన్ని మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేసినట్లు సమాచారం. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా మొత్తం మీద, ప్రభాస్–సందీప్ రెడ్డి కలయికలో వస్తున్న ‘స్పిరిట్’ ఇప్పటి నుంచే పాన్ ఇండియా ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తున్న భారీ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్‌కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!