NTV Telugu Site icon

LEO : ప్రభాస్ సలార్ రికార్డు క్రాస్ చేసిన లియో..

Whatsapp Image 2023 10 06 At 12.42.29 Pm

Whatsapp Image 2023 10 06 At 12.42.29 Pm

దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అర్జున్‌, సంజయ్‌దత్‌, త్రిష ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ డ్రామాగా లియో మూవీ తెరకెక్కుతోంది.లియో సినిమాలో కమల్‌హాసన్‌, కార్తి మరియు సూర్య అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లియో ట్రైలర్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. కొంత మంది విజయ్ ఫ్యాన్స్ మాత్రం ట్రైలర్‌తో లోకేష్ కనకరాజ్ డిసపాయింట్ చేశాడంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.యాక్షన్ సీన్స్ మొత్తం గ్రాఫిక్స్‌లో తీసినట్లుగా ఉన్నాయని, విజయ్ క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా చూపించలేదంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. లియో సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే బుక్ మై షోలో ప్రభాస్ సలార్ మూవీ రికార్డ్‌ను దళపతి విజయ్ లియో క్రాస్ చేసింది.ఇండియావైడ్‌గా బుక్ మై షోలో 2023 టాప్ ఫైవ్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ సినిమాల లిస్ట్‌లో దళపతి విజయ్ లియో టాప్ ప్లేస్‌లో ఉండగా సలార్ సెకండ్ ప్లేస్‌ కు వచ్చింది.విజయ్ లియో మూవీ కి 442 k ఇంట్రెస్టెడ్ నంబర్స్‌ అలాగే ప్రభాస్ సలార్‌కు 367 K ఇంట్రెస్టేడ్ నంబర్స్ రావడం జరిగింది.అలాగే ఇంట్రెస్టెడ్ మూవీస్ లిస్ట్‌లో సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ఖాన్ మూవీస్‌ను దాటేసి బాలకృష్ణ భగవంత్ కేసరి మూడో స్థానంలో కొనసాగుతోండటం విశేషం.. భగవంత్ కేసరి సినిమాకు 118 k ఇంట్రెస్టేడ్ నంబర్స్ తర్వాత సల్మాన్ ఖాన్ టైగర్ కు 113 K ఇంట్రెస్టేడ్ నంబర్స్ షారుఖ్‌ఖాన్ డుంకీ 82k ఇంట్రెస్టేడ్ నంబర్స్ రావడం జరిగింది.. విజయ్ లియో మూవీకి పాన్ ఇండియా వైడ్‌గా ఉన్న క్రేజ్‌ చూసి విజయ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు

Show comments