Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సలార్ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కేజీయఫ్ 1, 2 అఖండ విజయాల తర్వాత ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి తర్వాత వరుస ప్లాపులను ఎదుర్కొన్న రెబల్ స్టార్ భారీ హిట్ కోసం కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రం సలార్ పై ప్రభాస్ ఎన్నో అశలు పెట్టుకున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సలార్ మూవీ కోసం వేసిన సెట్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్‌ను షూట్ చేస్తున్నారు మేకర్స్.
Read Also: Rajamouli-Mahesh Movie Update: మహేష్‌తో తీసే సినిమా స్టోరీ లైన్ ఇదేనన్న రాజమౌళి
సలార్ మూవీ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. వాళ్లు రూపొందించిన యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్రబృందం తెలుపుతోంది. ప్రభాస్‌తో పాటు విలన్ పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభకు తాను ఫిదా అయ్యానంటూ చెప్పుకొచ్చాడు. ఇందులోని యాక్షన్ ఎడిసోడ్స్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా రూపొందించినట్లు కితాబిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సినిమా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
