NTV Telugu Site icon

Prabhas: అభిమానులకు గుడ్ న్యూస్.. డ్యూయల్ రోల్‎లో ప్రభాస్

New Project (4)

New Project (4)

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్.. తెరపై ఇద్దరు ప్రభాస్ లను చూసే అద్భుత అవకాశం. త్వరలో మారుతి డైరక్షన్ లో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చేశారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుంది. రెండు రోజుల్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు టైటిల్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వచ్చే సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. తాతమనవళ్లుగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారని టాక్.. రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో కథ నడుస్తుందట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు మాళవిక మోహనన్ కాగా.. మరొకరు నిధి అగర్వాల్. మూడో హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ లేదు.

Read Also: Bigg boss 6: కెప్టెన్సీ ఓటింగ్… మీమాంసలో ఆ ఇద్దరూ!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న, చేయబోతున్న సినిమాల లైనప్ ఓ రేంజ్‌లో ఉంది. ‘బాహుబలి’ తర్వాత నుంచి పాన్ ఇండియా ఆడియ‌న్స్‌ను టార్గెట్ చేస్తూ… ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’ చేస్తున్నారు. ఇప్పటివరకు మీడియం బడ్జెట్ సినిమాలు, మిడ్ రేంజ్ హీరోలతోనే సినిమాలు చేశారు మారుతి. అలాంటిది ప్రభాస్ ఇమేజ్ ని హ్యాండిల్ చేయగలరా.. అనే సందేహాలు కలిగాయి. మారుతి కూడా తనదైన స్టయిల్ లో ఓ హారర్ కామెడీ కథ రాసుకున్నారు. హారర్ సినిమాలకు కాలం చెల్లిన ఈ రోజుల్లో ప్రభాస్ తో అలాంటి సినిమా ఎందుకు చేయాలనుకున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్-మారుతి సినిమా కథ మొత్తం మారిపోయిందట. హారర్ సినిమా కాదు. ఓ క్రైమ్ కామెడీ నేపథ్యంలో కథను రాసుకున్నారట దర్శకుడు. వజ్రాల దోపిడీ మెయిన్ ప్లాట్ గా సినిమా సాగుతుందట. ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణం కూడా కథలో మార్పులు చోటు చేసుకోవడమేనని చెబుతున్నారు. హారర్ కామెడీను కాస్త క్రైమ్ కామెడీగా మార్చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను తీసుకోవాలనుకుంటున్నారట సినిమా టీం. ఇప్పటికే దర్శకనిర్మాతలు సంజయ్ దత్ తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సంజయ్ ను విలన్ రోల్ కోసం సంప్రదిస్తున్నారా..? లేక మరేదైనా పాత్రా..? అనే విషయంలో క్లారిటీ లేదు.

Show comments