Site icon NTV Telugu

Kalki 2898 AD : ఓకే వేదికపై ప్రభాస్, పవన్.. ఫ్యాన్స్ ను ఆపగలమా..?

Prabhas ,pawan Kalyan

Prabhas ,pawan Kalyan

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ గా వుంది.ఇప్పటికే ఈ చిత్రం నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.తాజాగా ఈ చిత్రం నుండి మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

Read Also :Trivikram : పవన్ కల్యాణ్ గెలుపు.. కాలినడకన తిరుమలకు త్రివిక్రమ్..

దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాలో ఓ అద్భుత లోకాన్ని ఆవిష్కరించాడు.థియేటర్స్ లో చూసే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ ఖాయమని నాగ్ అశ్విన్ తెలిపారు.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీస్థాయిలో నిర్వహించనున్నారు.ఇటీవల కూటమికి తన పూర్తి మద్దతు తెలిపిన నిర్మాత అశ్వినీదత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు భాద్యతలు స్వీకరించడంతో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారు.ఈ నెల 23 న గ్రాండ్ గా ఈ ఈవెంట్ జరగనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు.అయితే పవన్ కల్యాణ్ ను ,ప్రభాస్ ను ఒకే వేదికపై చూసిన ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం కష్టమే..ఈ వేడుక కోసం పవన్ ,ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version