Site icon NTV Telugu

Suma Kanakala : ప్రభాస్, పవన్ కళ్యాణ్‌పై సుమ ఎమోషనల్ కామెంట్స్

Suma Kanakala

Suma Kanakala

తెలుగు సినిమా హీరోలు భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారంటూ తరచూ సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ వినిపిస్తుంటాయి. కొందరు అటెన్షన్ కోసం అవగాహన లేకుండా కామెంట్స్ చేస్తుంటారు. కానీ అదే సమయంలో మన స్టార్స్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మాత్రం పెద్దగా చర్చ జరగదు. వెలుగులోకి రాని ఇలాంటి మంచి పనులు చూసినప్పుడు, ట్రోల్స్ ఎంత అర్థరహితంగా ఉంటాయో అనిపిస్తుంది.

Also Read : Mrunal Thakur : తెలుగు సినిమాకు ఎప్పుడు రుణపడి ఉంటా..

ఇటీవల టాప్ యాంకర్ సుమ కనకాల, పవన్ కళ్యాణ్, ప్రభాస్‌ల గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. ఖమ్మంలో ఓ వృద్ధాశ్రమం నిర్మాణానికి పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లు ఎంతో సహాయం చేశారని, తమతో పాటు మరికొందరు కూడా దీనికి తోడ్పడ్డారని సుమ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతేకాదు, ప్రభాస్ ఆ వృద్ధాశ్రమంలో ఉండే పెద్దల కోసం ప్రతినెలా వారి యోగక్షేమాలకు డబ్బు పంపిస్తుంటారని పేర్కొన్నారు. ఈ విషయం బయటకు రాకపోయినా, ఇది ప్రభాస్ మనసులోని దయా గుణాన్ని చూపిస్తుందని సుమ అన్నారు. ఈ తెలియని నిజాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి అజ్ఞాత సేవలు చేసే హీరోల్ని కూడా ట్రోల్ చేయడం నిజంగా బాధాకరమనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.

Exit mobile version