NTV Telugu Site icon

Prabhas : సీతారామం దర్శకుడితో ప్రభాస్ మూవీ..ఫోటో షూట్ ప్లాన్..

Prabhas

Prabhas

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న “కల్కి 2898 Ad ” సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కల్కి సినిమా తరువాత ప్రభాస్ లైనప్ లో చాలా సినిమాలే వున్నాయి.కల్కి తరువాత ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో “సలార్ పార్ట్ 2 ” సినిమా చేయనున్నాడని ఇదివరకే ఓ న్యూస్ వచ్చింది.అయితే ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ షూటింగ్ ఆగస్టు లో ప్రారంభం కానుంది.దీనితో ప్రభాస్ సినిమా లేట్ అయ్యే అవకాశం వుంది.అలాగే ప్రభాస్ మారుతీ డైరెక్షన్ లో “రాజాసాబ్ “అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.త్వరలోనే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.

Read Also :Kalki 2898 AD : గెట్ రెడీ.. కల్కి కథను చెప్పబోతున్న నాగ్ అశ్విన్..

ఇదిలా ఉంటే ప్రభాస్ సీతారామం ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా కమిట్ అయినట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.రీసెంట్ గా ప్రభాస్ కు హను రాఘవపూడి కథ వినిపించగా ప్రభాస్ ఎంతో ఇంప్రెస్స్ అయ్యాడని సమాచారం.ఈ సినిమా వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాలోని కొన్ని సీన్స్ లో ప్రభాస్ సైనికుడిలా కనిపించనున్నాడని సమాచారం.వెంటనే లుక్ టెస్ట్ ,ఫోటో షూట్ స్టార్ట్ చేయాలనీ హను రాఘవపూడికు ప్రభాస్ సూచించినట్లు తెలుస్తుంది.అలాగే ఈ సినిమాకు హను రాఘవపూడి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం.