NTV Telugu Site icon

Kalki2898AD Records: సౌత్ ఇండియా హీరోలలో ‘ఒకే ఒక్కడు’ ప్రభాస్!

Kalki

Kalki

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి’ విడుదలైన నాటి నుండి బాక్సాఫీస్‌ పై కలెక్టన్ల సునామి సృష్టిస్తుంది. వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ విజువల్ వండర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో క్లాస్, మాస్ సెంటర్ అనే తేడా లేకుండా భారీ కలెక్షన్లు రాబడుతోంది. భాషతో సంబంధం లేకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభను ప్రతీఒక్కరు కొనియాడుతున్నారు. కల్కితో తెలుగు సినిమా వైభవాన్ని హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టాడు నాగ్ అశ్విన్.

తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసులు చేస్తూ బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు తీస్తుంది. 10 రోజులకు గాను నైజాంలో రూ.110కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో నైజాంలో 3 చిత్రాలు రూ .100 కోట్ల గ్రాస్ సాధించిన హీరోగా రికార్డు సెట్ చేసాడు ప్రభాస్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 10 రోజులకు రూ.270 కోట్ల గ్రాస్ రాబట్టి ‘బాక్సాఫీస్‌ షేర్’గా నిలిచాడు ప్రభాస్.

Also Read: Kiran Abbavaram New Movie: కిరణ్ అబ్బవరం సినిమాకు ఇద్దరు దర్శకులు!

మరోవైపు ఓవర్ సీస్ లో ఈ చిత్రం కల్లెక్షన్ల సునామి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో $15.5M గ్రాస్ కలెక్ట్ చేసి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ కలెక్షన్లతో ఆల్ టైమ్ హైయ్యెస్ట్ సౌత్ ఇండియా గ్రాసర్ నాన్ బాహుబలి 2 గా ‘కల్కి’.. కేవలం 10 రోజుల్లో ఈ ఫిట్ సాధించింది. నార్త్ అమెరికాలో ఈ రికార్డు సాధించిన ‘ఒకే ఒక్కడు’ ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా రూ. 850 కోట్ల గ్రాస్ రాబట్టి రూ .1000 కోట్లు సాధించే దిశగా పయనిస్తోంది. లాంగ్ రన్ పూర్తయ్యేలోపు ఎంత కలెక్ట్ చేస్తుందో?, ఎటువంటి రికార్డు సెట్ చేస్తుందో? అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Show comments