యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా, అంతకంటే ముందే వేసిన ప్రీమియర్ షోలతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల ప్రకారం.. సినిమాలో పెద్దగా ట్విస్టులు, భారీ కామెడీ లేకపోయినా, కథ చాలా నీట్ గా, సింపుల్ గా సాగిపోతుంది. ముఖ్యంగా సంతోష్ శోభన్ తన నటనతో మరోసారి మెప్పించగా, మానస వారణాసి తన అందంతో ఆకట్టుకుంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉండటం వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. మొత్తానికి ఒక డీసెంట్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలుగుతుందని ఆడియన్స్ చెబుతున్నారు. అయితే ఈ చిన్న సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి పడేలా చేశారు రెబల్ స్టార్ ప్రభాస్.
Also Read : Varanasi: మహేష్ ‘వారణాసి’ కోసం రాజమౌళి కొత్త స్ట్రాటజీ..!
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ స్పందిస్తూ.. ‘ఇదొక అందమైన ప్రేమకథ. సినిమా చూస్తున్నంత సేపు నేను చాలా ఎంజాయ్ చేశాను. నా కెరీర్‌లో ‘వర్షం’ సినిమా ఎంత స్పెషలో.. సంతోష్‌కి ఈ సినిమా అంతలా గుర్తుండిపోతుంది’ అని పోస్ట్ చేశారు. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సంతోష్ శోభన్ ఆనందానికి అవధులు లేవు.ఈ చిత్రంపై ఆయన ప్రశంసల జల్లు కురిపించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి మంచి బూస్ట్ లభించింది. దీంతో హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్‌లో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ‘ప్రభాస్ అన్న నా సినిమా చూసి మెచ్చుకోవడం చూస్తుంటే నేను జీవితంలో గెలిచాననే అనుభూతి కలుగుతోంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం, వాలెంటైన్స్ డే సీజన్‌కు పర్ఫెక్ట్ మూవీ అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
