NTV Telugu Site icon

Prabhas Number 1: ఇండియా నంబర్ వన్ హీరోగా ప్రభాస్‌.. నం.1 హీరోయిన్‌ ఎవరంటే?

Prabhas Ormax Media List

Prabhas Ormax Media List

Alia Bhatt Number One Actress in Ormax Media List: పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ‘ఆర్మాక్స్‌’ విడుదల చేసిన మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాలో నంబర్ వన్‌గా నిలిచారు. జూన్‌ నెలకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ల జాబితాను ఆర్మాక్స్‌ గురువారం విడుదల చేసింది. ఇందులో ప్రభాస్‌ అగ్రస్థానంలో నిలవగా.. మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌ల జాబితాలో బాలీవుడ్ భామ అలియా భట్‌ టాప్‌లో నిలిచారు.

మే నెలలో ఆర్మాక్స్‌ విడుదల చేసిన మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాలో ప్రభాస్ టాప్‌ వన్‌లో ఉన్నారు. ప్రభాస్ వరుసగా టాప్‌లో నిలవడానికి ‘కల్కి 2898 ఏడీ’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి హవా కొనసాగుతున్న నేపథ్యంలో జులైలో కూడా నంబర్ వన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే హ్యాట్రిక్ కొడతారు. జూన్‌ జాబితాలో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ రెండో స్థానంలో ఉన్నారు. దళపతి విజయ్ మూడో స్థానంలో ఉన్నారు. టాలీవుడ్ హీరోస్ అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, మహేష్ బాబులు వరుసగా 4, 5,6 స్థానాల్లో నిలవగా.. రామ్‌ చరణ్‌ 9వ స్థానంలో ఉన్నారు.

Also Read: Bottle Gourd-Boy: వింత ఘటన.. యువకుడి కడుపులో అడుగు సొరకాయ!

ఆర్మాక్స్‌ మీడియా విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌ల జాబితాలో అలియా భట్‌ నంబర్ వన్‌గా నిలిచారు. సమంత, దీపికా పదుకొణె, కాజల్ అగర్వాల్, కత్రినా కైఫ్ టాప్-5 జాబితాలో ఉన్నారు. టాప్ 10 జాబితాలో 6 మంది దక్షిణాది సినిమాలకు చెందిన వారు ఉండగా.. 4 మంది బాలీవుడ్‌కు చెందినవారు ఉండడం విశేషం. నయనతార, రష్మిక మందన్న, కియారా అద్వానీ, కృతి సనన్, త్రిషలు టాప్ 10 ఉన్నారు.

Show comments