Tollywood Hero Prabhas Upcoming Movies List: ‘బాహుబలి’ సినిమాలతో రెబల్ స్టార్ ‘ప్రభాస్’ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి అనంతరం డార్లింగ్ చేసిన చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ పాన్ ఇండియా లెవల్లో విడుదల అయ్యాయి. సలార్ మినహా మిగతా మూడు సినిమాలు ఫ్లాఫ్ అయినా.. ప్రభాస్ రేంజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా చేయాలంటే ఏ డైరెక్టర్ అయినా కనీసం రెండేళ్ల వరకు ఆగాల్సిందే.
ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కీ 2898 ఏడీ’ సినిమాలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వవ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు సలార్ పార్ట్ 2లో నటించాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుందట.
Also Read: Rishabh Pant: పంత్ నువ్వెప్పుడూ తలొంచకూడదు.. ఎప్పుడూ నవ్వుతూనే ఉండు!
కల్కీ 2898 సినిమాకి రెండో భాగం కూడా ఉంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ ఓ కీలక పాత్ర చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు అన్ని పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. అనంతరం సీతారామంతో అందరి మనసులు గెలుచుకున్న హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. ప్రస్తుతం ఏ హీరో చేతిలో లేనన్ని సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. 2026 వరకు ఆయన డేట్స్ ఖాలీగా లేవు.
