Prabhas : సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత తెలుగులో ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న హీరో సూర్య. తెలుగులో సూర్యకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. తెలుగు ప్రేక్షకులు ఆయనను దత్త పుత్రుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. సూర్య సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలవుతాయి. ఇక్కడ సూర్యకి మంచి మార్కెట్ కూడా ఉంది. ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో ‘కంగువా’ సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమా బడ్జెట్ రూ.350 కోట్లకు పైగానే ఉంటుందని చెన్నై టాక్. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు చిత్రాలను రూపొందించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథ రెండు టైం లైన్స్‌లో సాగుతుంది. ఒకటి 1500 ఏళ్ల క్రితం జరిగింది.. రెండోది ప్రస్తుత కాలం. ఇది రెండు కాలక్రమాలలో ఏకకాలంలో జరుగుతుంది. ఈ సినిమా కథ 1500 నుండి ఈ కాలానికి వచ్చిన ఒక గిరిజన యోధుని చుట్టూ తిరుగుతుంది.
Read Also:T20 World Cup 2024: ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు రెండో విజయం.. మరొక్క గెలుపే!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు సెట్ చేసుకుని రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ సౌత్ చిత్రాల్లో “కంగువా” కూడా ఒకటి. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఆ మధ్య విడుదలైన టీజర్ రేంజ్ ని పెంచేసింది. మరీ ముఖ్యంగా హాలీవుడ్ స్థాయి విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. మరి దర్శకుడు శివ అలాగే హీరో సూర్య కాంబినేషన్లో చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ ప్రాజెక్ట్ సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కింది. మరి ఈ సినిమా రిలీజ్ కు సమయం దగ్గరకి వస్తుండగా మేకర్స్ సాలిడ్ ప్లానింగ్స్ కూడా చేస్తున్నారు.
Read Also:Rajinikanth: వద్దంటే వినలేదు.. ఆయన వల్లే సినిమా ఫ్లాప్ అయింది.. రజనీకాంత్ పై డైరెక్టర్ ఆరోపణలు
అలా ఈ సినిమా తెలుగు ప్రమోషన్ల కోసం ఏకంగా డార్లింగ్ ప్రభాస్ ను రంగంలోకి దింపే ప్లాన్ లో ఉన్నట్లు ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ ఉన్న భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. వీరికి ప్రభాస్ కి ఉన్న స్నేహం ఎలాంటిదో అందరికీ చెప్పాల్సిన పని లేదు. అలా కంగువా ప్రీ రిలీజ్ కోసం డార్లింగ్ హీరో వచ్చే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో వేచి చూడాలి. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అలాగే దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది.