NTV Telugu Site icon

Prabhas Fan: ‘కల్కి 2898 ఏడీ’ క్రేజ్.. షాప్ క్లోజ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్!

Kalki 2898 Ad

Kalki 2898 Ad

Prabhas Fan Closed His Shop to watch Kalki 2898 AD Movie: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా.. ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చిస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ఫ్యాన్ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే టిక్కెట్స్ బుక్ చేసుకుని.. రెడీ అయిపోయారు. సినిమా చూడడం కోసం కొందరు ఫాన్స్ అయితే కాలేజెస్.. ఆఫీస్‌లు బంక్ కొట్టడానికి సిద్ధమైపోయారు. ఇంకొందరు అయితే తమ షాప్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని కల్కి సినిమా చూడడం కోసం తమ షాపును క్లోజ్ చేశాడు.

కల్కి 2898 ఏడీ సినిమా చూడడం కోసం అజయ్ వేగేశ్న అనే ఫ్యాన్ రిలీజ్ రోజున తన షాపును క్లోజ్ చేశాడు. ఈ విషయాన్ని అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తెలిపాడు. ‘జూన్ 27న షాప్ క్లోజ్ చేస్తున్నా. బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా కల్కి 2898 ఏడీని చూడ్డానికి మేం వెళుతున్నాం. మీరు కూడా సినిమా చూస్తారనుకుంటున్నా. ఈ అసౌకర్యానికి నన్ను మన్నించండి’ అని అజయ్ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Rohit-Pant: రిషబ్ పంత్ అత్యుత్సాహం.. రోహిత్ శర్మ సీరియస్ (వీడియో)!

ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రం కల్కి. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్‌ పూర్తయ్యాయి. ప్రీ బుకింగ్స్‌లో కొన్ని బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేసింది. కల్కి ఓపెనింగ్‌ కలెక్షన్లు రూ.200 కోట్లు ఖాయమని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇందులో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె నటించగా.. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ దిశా పటాని తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Show comments