Site icon NTV Telugu

Prabhas Dupe: వామ్మో.. ప్రభాస్ డూప్ రెమ్యూనరేషన్ అన్ని లక్షలా?

Prabhash (3)

Prabhash (3)

పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అందరికీ తెలుసు.. వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.. టాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజులో సినిమాలు చేస్తున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.. ఈ ఏడాది రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా గురించి ప్రపంచానికి తెలిసేలా రాజమౌళి చేస్తే.. తన టాలెంట్ తో ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు.. గత ఏడాది చివర్లో విడుదలైన సలార్ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నాడు..

ఇక త్వరలో ‘కల్కి’ మూవీతో రాబోతున్నాడు. ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా మాట్లాడుకుంటున్న టైంలో ప్రభాస్ డూప్‌కి ఇచ్చే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరికీ బాడీ డబుల్ లేదా డూప్ ఉంటారు. అంటే ఫైట్ సీన్స్‌లో కొన్నిచోట్ల హీరోల కనిపిస్తే.. వెనక నుంచి, సైడ్ నుంచి కనిపించే కొన్ని షాట్స్‌లో హీరోల పోలిన వ్యక్తులని అంటే డూప్ లను పెట్టి మేనేజ్ చేస్తారు.. ప్రభాస్‌కు కిరణ్ రాజ్ అనే వ్యక్తి డూప్‌గా చేస్తుంటాడు. ‘బాహుబలి’ సినిమా తర్వాత కిరణ్ రాజ్ కాస్తంత పాపులరాటీ తెచ్చుకున్నాడు..

మాములుగా సినిమాల్లో డూప్ లు చేసేవారికి నిర్మాతలు డబ్బులు ఇవ్వడం మనం వినే ఉంటాం.. కానీ ప్రభాస్ కోసం పని చేసేవాళ్లకు మాత్రం ప్రతి ఒక్కరికి తానే జీతాలు చెల్లిస్తాడు. రీసెంట్‌గానే ఈ విషయం బయటకొచ్చింది. అలానే డూప్‌గా నటించే కిరణ్ రాజ్‌కి ఒక్కో చిత్రానికి గానూ దాదాపు రూ.30 లక్షలు పైనే ప్రభాస్ చెల్లిస్తాడట.. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే ఇస్తాడని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది..

Exit mobile version