NTV Telugu Site icon

Prabhas : ప్రభాస్ కూడా జాతకాలను నమ్మతున్నాడా?

Prabhash

Prabhash

సైన్స్ రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతుంది.. అయిన కొందరు జాతకాలు, దోషాలు పూజలు అంటూ మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు.. మామూలు జనాల కన్నా కూడా సినీ స్టార్స్, రాజకీయ వేత్తలు వీటిని కాస్త ఎక్కువగా నమ్ముతుంటారు..చాలామంది రాజకీయ నాయకులు సినిమా వాళ్లు వారి జాతకం ప్రకారం భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగానే తెలుసుకుంటారు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు జాతకాలు నమ్ముతారని చాలా సార్లు రుజువైంది.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో హీరో వచ్చి చేరినట్లు తెలుస్తుంది..

ప్రముఖ ఆస్ట్రాలజర్ అయిన వేణు స్వామి చెప్పిన కొన్ని నిజమవడంతో చాలామంది హీరోయిన్లు, హీరోలు ఆయన దగ్గరికి జాతకం కోసం క్యూ లు కడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ కూడా జాతకాలు నమ్ముతున్నాడు అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే చాలా వరకు ప్రభాస్ జాతకాలు నమ్ముడు అని, ఆయనకు జాతకాల మీద నమ్మకం ఉండదు అని ఇండస్ట్రీ జనాలు చెబుతూ ఉంటారు. కానీ ఈ విషయం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ జాతకాలను నమ్ముతాడా అంటూ ఆశ్చర్య పోతారు..

ప్రభాస్ హీరోగా రాబోతున్న తాజా సినిమా సలార్,ఈ సినిమా టీజర్ ని మరో రెండు రోజుల్లో అనగా జులై 6న భారీ అంచనాల మధ్య విడుదల చేయడానికి మూవీ యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. అయితే సలార్ టీజర్ ని జులై 6న ఉదయం 5:12 నిమిషాలకు రిలీజ్ చేస్తారట. అయితే చాలామంది నెటిజన్స్ ఎవరైనా ఉదయం పూట లేదా మధ్యాహ్నం లేదా రాత్రి టీజర్ రిలీజ్ చేస్తారు.కానీ ఇలా ఎవరు నిద్ర లేవని టైంలో టీజర్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి.. అందులో డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో అర్థం కాక జనాలు జుట్లు పీక్కుంటున్నారు..

ఇక ఈ మధ్యకాలంలో విడుదలైన ఆది పురుష్ సినిమా కి సంబంధించిన అన్ని రకాల అప్డేట్ లు ఏకంగా 8 గంటల లోపే ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏకంగా సలార్ సినిమా గురించి ఎవరు లేవకముందు అంటే ఐదు గంటలకే ఈ టీజర్ రిలీజ్ చేయడంతో చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి ప్రభాస్ ఏమైనా జాతకాలు ఫాలో అవుతున్నారా.. అందుకే ఇలా ఉదయం పూట తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారా అంటూ జనాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజుకు ఆగాల్సిందే..