పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఆదిపురుష్ సినిమా తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.కానీ ఆ సినిమా ప్రభాస్ కు నిరాశనే మిగిల్చింది. ఆదిపురుష్ సినిమా తో ప్రభాస్ కొద్దిగా డిస్సపాయింట్ అయ్యాడు. తన తరువాత సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు.ప్రభాస్ తన తరువాత సినిమా సలార్ భారీ అంచనాల తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమా తో పాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా లో కూడా నటిస్తున్నాడు.అలాగే మారుతి దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక కన్నడ దర్శకుడి తో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ కన్నడ దర్శకుడు చెప్పిన కథ ప్రభాస్ కి బాగా నచ్చడం తో వెంటనే ఓకే చెప్పాడు అంటూ సోషల్ మీడియాలో ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. వచ్చే సంవత్సరం లో ప్రభాస్ మరియు ఆ కన్నడ దర్శకుడు సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయనీ తెలుస్తుంది..ప్రభాస్ చేస్తున్న వరుస సినిమాల షూటింగ్ పూర్తి అయిన తరువాత ప్రభాస్ ఆ కన్నడ దర్శకుడు సినిమా కోసం డేట్స్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.సినిమాల విషయంలో ప్రభాస్ స్పీడ్ పెంచాడు.ఇప్పుడు ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు ఉండే విధంగా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.సెప్టెంబర్ నెలలో ఆ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.సలార్ సినిమాను కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.