Chakram ReRelease : టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది.ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలను మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు .రీ రిలీజ్ రోజు ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు.ప్రస్తుతం ఈ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లోనే కోలీవుడ్ లో కూడా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే క్లాసిక్ మూవీగా నిలిచిన చక్రం మూవీ రీ రిలీజ్ కాబోతుంది.ఇదివరకే ప్రభాస్ నటించిన వర్షం ,మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో పాటు మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.
Read Also :Swag : మీరా జాస్మిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్…
ఇప్పుడు ప్రభాస్ నటించిన చక్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చక్రం మూవీ 2005 లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే అప్పటికే మాస్ ఇమేజ్ వున్నప్రభాస్ ఇలాంటి క్లాస్ మూవీలో నటించడంతో ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. దీనితో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఈ సినిమా కమర్సియల్ గా ప్లాప్ అయినా కూడా ప్రభాస్ కెరీర్ లో క్లాసిక్ మూవీగా ఈ సినిమా నిలిచింది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఛార్మి ,అసిన్ హీరోయిన్స్ గా నటించారు.అలాగే ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు.ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ఈ చక్రి అందించిన పాటలు ఇప్పటికి ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు.ఇదిలా ఉంటే ఈ సినిమాను జూన్ 8 న గ్రాండ్ గా రీరిలీజ్ చేయనున్నారు.
