NTV Telugu Site icon

Salaar 2 : ఏంది సామి మూడు సినిమాలా? ‘సలార్ 2’తో స్టార్ట్

Salaar2

Salaar2

Salaar 2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు ఒకే నిర్మాణ సంస్థకు సైన్ చేశాడు డార్లింగ్. ఇప్పటికే ప్రభాస్ చేతిలో అరడజను వరకు సినిమాలున్నాయి. ది రాజాసాబ్, ఫౌజీ సెట్స్ పై ఉండగా.. స్పిరిట్, సలార్ 2, కల్కి 2 త్వరలో మొదలు కానున్నాయి. ఈ సినిమాల తర్వాత స్టార్ డైరెక్టర్స్ ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలన్నీ వేర్వేరు నిర్మాణ సంస్థలతో చేస్తున్నాడు. అన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే. కానీ కెజీయఫ్, కాంతార, సలార్ వంటి సినిమాలను నిర్మించిన కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌లో ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేశాడు ప్రభాస్. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ బిగ్ అనౌన్స్మెంట్ చేశారు హోంబలే వారు.

Read Also:Hero Vijay: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవలేడు.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!

భారతీయ సినిమా స్థాయిని పెంచేలా ఈ ప్రాజెక్టులు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా, మునుపెన్నడూ చూడని సినిమాటిక్‌ అనుభూతిని అందించనున్నట్లు ప్రకటించారు. ‘భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా మూడు చిత్రాల పార్ట్నర్‌షిప్‌లో ప్రభాస్‌తో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాటిక్‌ అనుభూతిని సృష్టించడానికి వేదిక సిద్ధమైంది. సలార్2తో ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది.. సిద్ధంగా ఉండండి’ అని పేర్కొన్నారు. అలాగే.. ఈ మూడు సినిమాలు 2026, 2027, 2028లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతాయని తెలిపారు. అయితే.. సలార్ 2 పక్కన పెడితే.. నెక్స్ట్ రెండు సినిమాల దర్శకులు ఎవరు? మళ్లీ ప్రశాంత్ నీల్‌తోనే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదంటే.. కెజియఫ్‌ 3లో ప్రభాస్ ఉంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఒకే సంస్థకు ప్రభాస్ మూడు సినిమాలు సైన్ చేయడం అంటే.. హోంబలే ఫిల్మ్స్‌ పై కోట్ల వర్షం కురుస్తుందనేది మాత్రం గ్యారెంటీ.

Read Also:Kishan Reddy: టెక్నికల్ సమస్యల పేరుతో ఆలస్యం చేయడం తగదు..

Show comments