NTV Telugu Site icon

Prabhas New Movie: సంక్రాంతికి బరి నుంచి ప్రభాస్ సినిమా ఔట్.. రూ.100కోట్లతో రీ ష్యూట్

Prabhas

Prabhas

Prabhas New Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన సాహో, రాధేశ్యామ్ ఘోర పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు ఆయనతో పాటు తన అభిమానులు కూడా రాబోతున్న సినిమా పై ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్లో ఈ చిత్రం టీజర్ విడుదలైంది. కానీ, దానిపై ప్రపంచవ్యాప్తంగా భారీగా విమర్శలు వచ్చాయి. ప్రభాస్ లుక్ బాగాలేదని, టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ తేలిపోయానని అన్నారు. ముందుగా ఈ సినిమాను సంక్రాతికి రిలీజ్ చేద్దామని భావించింది చిత్రబృందం. ఈ ప్రయత్నంలో భాగంగా సినిమా టీజర్ ను అక్టోబర్ 2న విడుదల చేసింది. ఈ టీజర్ చూసి ప్రేక్షకులే కాకుండా ప్రభాస్ అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ చెందారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలు టీజర్ చూశాక అడియాశలు అయ్యాయి. పలు కారణాలతో రిలీజ్ డేట్ ను మారుస్తూ వేసవికి తీసుకొస్తామని చెప్పింది టీమ్.

Read Also: Bala Krishna : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్.. మామూలుగా ఉండదైతే

ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆదిపురుష్ టీమ్ మరో బ్యాడ్ న్యూస్ తెలిపింది. వీఎఫ్ ఎక్స్, సీజీ వర్క్స్ లో తప్పిదాలను సరిచేసే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఏకంగా రూ. వంద కోట్ల ఖర్చుతో వీఎఫ్ ఎక్స్ షాట్స్ ను సరి చేస్తోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రం విడుదల ఆలస్యం కానుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ మేరకు పోస్టర్స్, టీజర్ లో విడుదల తేదీని కూడా వెల్లడించింది. కానీ, ఇప్పుడు వీఎఫ్ ఎక్స్ తప్పులు సరి చేసేందుకు చాలా సమయం తీసుకోవడంతో సంక్రాంతికి బదులు వేసవిలోనే చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై చిత్ర బృందం తొందర్లోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Show comments