NTV Telugu Site icon

Powerlifting Championship: పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన భారతీయ తండ్రీ కొడుకులు

Powerlifting Championship

Powerlifting Championship

Powerlifting Championship: గుజరాత్‌లోని కచ్‌కు చెందిన టీనేజర్ వత్సల్ మహేశ్వరి, అతని తండ్రి నిఖిల్ మహేశ్వరి జంట అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి భారతదేశానికి కీర్తిని తీసుకువచ్చారు. భుజ్‌కు చెందిన 20 ఏళ్ల టీనేజర్ వత్సల్ మహేశ్వరి రష్యాలో జరుగుతున్న జూనియర్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 3 బంగారు పతకాలు సాధించి భారతదేశాన్ని గర్వించేలా చేసాడు. వత్సల్ పవర్‌లిఫ్టింగ్ డెడ్‌లిఫ్ట్ అంతర్జాతీయ పోటీలలో బంగారు పతకాలను గెలుచుకున్నాడు. చిన్న వయసులోనే పవర్‌లిఫ్టింగ్‌లో అద్భుతంగా రాణించి 3 బంగారు పతకాలు సాధించాడు. గతంలో కజకిస్థాన్‌లో జరిగిన పోటీల్లో కూడా వత్సల్ అద్భుతంగా రాణించి రజతం, బంగారు పతకాలు సాధించాడు. అలా ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న ఛాంపియన్‌షిప్‌లో 3 బంగారు పతకాలు సాధించాడు. ఇంతకు ముందు వత్సల్ పవర్‌లిఫ్టింగ్‌లో మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. అతను ఆసియా డెలిఫ్ట్‌లో బంగారు పతక విజేతగా నిలిచాడు. ఇది కాకుండా, అతను 6 సార్లు రాష్ట్ర బంగారు పతక విజేతగా కూడా నిలిచాడు. రష్యాలో జరుగుతున్న జూనియర్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో వత్సల్ 82.5 కిలోల విభాగంలో 76.8 కిలోలతో పాటు డెడ్‌లిఫ్ట్‌లో 230 కిలోలు ఎత్తాడు. 540 కిలోల బరువును పూర్తి బలంతో ఎత్తగా, 205 కిలోల బరువును స్క్వాట్‌లో ఎత్తాడు. దీనితో మూడు పోటీల్లోనూ బంగారు పతకాలు సాధించాడు.

Also Read: Lions Attack Cow: నాలుగు సింహాల మధ్య చిక్కుకున్న ఎద్దు.. తన ప్రాణాలను ఎలా కాపాడుకుందంటే? (వీడియో)

ఈ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం నుండి మొత్తం 10 మంది పోటీదారులు వివిధ విభాగాలలో పాల్గొన్నారు. ఇకపోతే మరోవైపు వత్సల్ తండ్రి నిఖిల్ మహేశ్వరి కూడా ఈ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజత పతకాలను సాధించి భారత దేశానికీ కీర్తిని కీర్తిని తెచ్చిపెట్టాడు. నిఖిల్ మహేశ్వరి 100 కిలోల విభాగంలో 92.3 కిలోల బరువుతో మొత్తం 3 పతకాలు సాధించాడు. ఇందులో ప్రపంచం నలుమూలల నుండి 5 మంది పోటీదారులు పాల్గొన్నారు. నిఖిల్ మహేశ్వరి ఫుల్ పవర్ లిఫ్టింగ్‌లో 495 కిలోల బరువు ఎత్తి బంగారు పతకం, పుష్ అండ్ పుల్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం, బెంచ్ ప్రెస్ పోటీలో రజత పతకం సాధించారు. ఇలా తండ్రీకొడుకులు ప్రపంచస్థాయిలో పతకాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు.