Site icon NTV Telugu

Earthquake: 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక..!

Earthquake

Earthquake

Earthquake: అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, తజాకిస్తాన్‌లోనూ వరుసగా భూప్రకంపనలు నమోదయ్యాయి. అదే విధంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో కూడా స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం, అలాస్కాలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2 గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 48 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించారు. ఇదివరకు కూడా జూలై 17న అలాస్కాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇది 36 కిలోమీటర్ల లోతులో నమోదయ్యింది.

Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్ట్‌పై 12 మందితో టెక్నికల్ కమిటీ ఏర్పాటు దిశగా కేంద్రం ప్లాన్

ఓ నివేదిక ప్రకారం, అలాస్కాలో భూకంపం తర్వాత అలాస్కా తీర ప్రాంతాల కోసం సునామీ హెచ్చరిక జారీ చేయబడ్డాయి. అమెరికా జాతీయ వాతావరణ సేవ ప్రకారం, ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు తరలిపోవాలని, తీర ప్రాంతాలను అలాగే జలమార్గాలను విడిచిపెట్టాలనే హెచ్చరికలు జారీ చేశారు. ఇమరోవైపు తజాకిస్తాన్‌లో కూడా 4.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. ఇది 23 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకుంది. అంతకముందు జూలై 18న 3.8 తీవ్రత, జూలై 12న 4.8 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. ఇవి 160 కిలోమీటర్ల లోతులో నమోదు అయ్యాయి.

Tripti Dimri : త్రిప్తి దిమ్రీ బోల్డ్ స్టేట్మెంట్ !

ఇక భారత్ లోని జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రత, 10 కిలోమీటర్ల లోతు వద్ద భూకంపం సంభవించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో గత రాత్రి 3.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇది 5 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

Exit mobile version