NTV Telugu Site icon

Poultry Farms: వర్షాకాలంలో కోళ్ల ఫారాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Poultry

Poultry

రైతులకు అధిక దిగుబడి ఇచ్చే వాటిలో కోళ్ల పరిశ్రమ ఒకటి.. రోజు రోజుకు ఈ పరిశ్రమకు డిమాండ్ పెరుగుతుంది.ఎక్కువ మంది వీటిని పెంచుతున్నారు.. అయితే ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వర్షాల కారణంగా మనుషులకే కాదు.. పశు పక్షాదులకు కూడా అనేక రోగాలు వస్తుంటాయి.. కోళ్లకు కూడా పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్ళలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి వర్షాకాలం పూర్తయ్యే వరకు రైతులు కోళ్ల ఫారాల్లో చేపట్టాల్సిన జాగ్రత్తలు చర్యలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అధిక వర్షాల వల్లన కోళ్లు అధిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పెంపకం చేపట్టే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఉత్పాదకతను గణనీయంగా పెంచుకోవచ్చు.. ఎక్కువగా వర్షాలు పడితే కోళ్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతే కాదు తాగునీరు కూడా కలుషితమవుతుంది. దీంతో కోళ్ల చనిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం గుడ్లు, చికెన్ ను ఎక్కువగా తింటున్నారు.. అందుకే రైతులు ఇలాంటి సమయాన్ని క్యాష్ చేసుకోవచ్చు..

కోళ్ల పరిశ్రమపై రైతులు దృష్టి సారించాలి.. ముఖ్యంగా బ్రూడింగ్ దశ నుండి ఉష్ణోగ్రతలు తగ్గకుండా చూసుకోవాలి. వర్షం వచ్చే సూచనలను గ్రహించి తగు చర్యలు తీసుకోవాలి. కోళ్లకు అవసరమైన ముడిసరుకులను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు టీకాలు సకాలంలో వేయించాలి. షెడ్లలో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వర్షపు జల్లు పడకుండా వెంటిలేటర్లకు గొనె సంచులు కట్టాలి. అంతేకాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఎప్పటికప్పుడు దాణా నమూనాలను పరీక్షిస్తూ ఉండాలి.. అందుకే ముందే వీటికి టీకాలను వేయించడం మంచిది.. ఇది పౌల్ట్రీ రైతులు గుర్తు పెట్టుకోవాలి..`