ప్రభుత్వ సంస్థల్లో పోస్టాఫీస్ కూడా ఒకటి.. ప్రజలకు అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి.. ఇప్పటికే ఎన్నో పథకాలను అందిస్తున్నాయి. కొందరు రిస్క్ తీసుకుని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే.. మరి కొందరు వడ్డీ తక్కువ వచ్చినా ఎలాంటి రిస్క్ లేని ప్రభుత్వ పథకాల వంటి వాటిల్లో తమ డబ్బులను పెడుతుంటారు. ఈరోజు మనం టైం డిపాజిట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ స్కీమ్ లో కనీసం రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. 10 ఏళ్ల వయసు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. మైనర్ల కోసం జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేసి డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యొచ్చు.. అలాగే ఈ స్కీమ్స్ లో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ టైమ్ పీరియడ్ ను కూడా ఎంపిక చేసుకోవచ్చు..
ఉదాహరణకు రూ. 5 లక్షలు డిపాజిట్ చేశారు అనుకుంటే.. 5 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే 7.5 శాతం వడ్డీ వర్తిస్తుంది. దీని ప్రకారం వడ్డీ రూపంలో రూ. 2,24,974 అందుతుంది. మొత్తం వడ్డీని కలిపి రూ. 5,51,175 వడ్డీ లభిస్తుంది. అది కాస్త పదేళ్ల తర్వాత రెండింతలు అవుతుంది. అంటే మీ చేతికి రూ. 10,51,175 వస్తాయి.. ఇప్పుడు ఎక్కువగా ఈ స్కీమ్ లోనే డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు..
