NTV Telugu Site icon

Vizag Swetha Case: శ్వేత మృతి కేసు.. కీలకంగా మారిన పోస్టుమార్టం రిపోర్టు

Swetha Case

Swetha Case

Vizag Swetha Case: విశాఖ బీచ్‌లో శ్వేత అనే మహిళ మృతదేహం కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. విశాఖ బీచ్‌లో యువతి మృతదేహం కేసులో పోస్టుమార్టం రిపోర్టులో ఏముందనేది ఆసక్తిగా మారింది. ఆర్కే బీచ్‌లో శ్వేత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. విశాఖ మూడో పట్టణ పోలీసులు, రెవెన్యూ అధికారులు శ్వేత మృతదేహానికి శవ పంచానామా నిర్వహించారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ మార్చురీలో ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఈ పోస్టుమార్టానికి సంబంధించిన నివేదికను వైద్యులు పోలీసులకు అందించారు. ఈ నివేదికలో ఏముంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదట శ్వేత మృతిని ఆత్మహత్యగా అనుకున్నారు. కానీ ఆమె మృతదేహం పడి ఉన్న తీరు అనుమానాస్పదంగా ఉండడంతో.. అనుమానాస్పద మృతిగా కేసును విచారణ చేపట్టారు. విశాఖ మూడో పట్టణ పోలీసుల చేతుల్లో ప్రస్తుతం ఈ పోస్టుమార్టం నివేదిక ఉంది.

శ్వేత అనుమానాస్పద మృతిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్వేత తల్లి ఆరోపణల మేరకు, సూసైడ్‌ లెటర్‌ ఆధారంగా ఆమె.. భర్త, అత్త, మామ, ఆడపడుచు భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పోలీసులు శ్వేత ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మరోవైపు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. శ్వేతను ఆమె భర్త మణికంఠ, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తే, మణికంఠ సోదరి భర్త సత్యం లైంగిక వేధింపులకు గురి చేసినట్లు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆమె తల్లి రమ ఫిర్యాదు చేశారు. ఒకటి రెండు సార్లు శ్వేతను ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మణికంఠ సోదరి భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అత్త, ఆడపడుచులపై వరకట్న వేధింపుల కేసు కట్టి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Ambati Rambabu : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హజరయ్యే హక్కు చంద్రబాబుకు లేదు

శ్వేత మృతదేహాన్ని ఆమె తల్లి, బంధువులకు అప్పగించగా.. కాన్వెంట్‌ కూడలి సమీపంలోని చావులమదుం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రద్దీగా ఉండే బీచ్ రోడ్‌లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో.. దర్యాప్తు ముందుకు సాగడం లేదు. శ్వేత ఏ సమయంలో ఎక్కడ ఉంది అనే అంశాలపై పోలీసులకు స్పష్టమైన అవగాహన రావడం లేదు. దీనివల్లే ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో పోస్టుమార్టం నివేదికతో పాటు ఆమె సెల్‌ఫోన్‌ కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Show comments