NTV Telugu Site icon

Batenge to Katenge: ‘మహా’మంత్రంగా సీఎం యోగి ‘‘బటేంగే తో కటేంగే’’ నినాదం..

Yogi

Yogi

Batenge to Katenge: మహారాష్ట్ర ఎన్నికల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నినాదం ‘‘బాటేంగే తో కటేంగే’’ మారుమోగుతోంది. మహరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో యోగి ఫోటో, నినాదంతో ప్లేక్సీలు వెలిశాయి. ముఖ్యంగా ముంబైలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు సందడి చేస్తున్నాయి. హర్యానా ఎన్నికల సమయంలో కూడా ఈ నినాదం చాలా ఫేమస్ అయింది. ‘‘ విడిపోతే.. నాశనం అవుతాం’’ అని అర్థమయ్యే ఈ నినాదాన్ని హిందువుల ఐక్యత కోసం యోగి చెప్పినట్లు తెలుస్తోంది.

Read Also: India Canada: లారెన్స్ బిష్ణోయ్ లింక్స్‌.. కెనడా ఆరోపణల్లో కీలక విషయాలు..

భారత్‌కి స్వాతంత్య్రం, దేశ విభజన వచ్చిన సమయంలో హిందువుల ఊచకోత వంటి అంశాలను ఉదహరిస్తూ యోగి ఈ కామెంట్స్ చేశారు. ఆగస్టులో బంగ్లాదేశ్ అల్లర్లను ఉదహరిస్తూ సమాజంలో విభజన పర్యవసానాలపై హెచ్చరించారు. జాతీయ ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ఆగ్రాలో మాట్లాడుతూ.. “దేశానికి మించినది ఏదీ ఉండదు. మనం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం సాధికారత పొందుతుంది.బంగ్లాదేశ్‌లో ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఆ తప్పులు ఇక్కడ పునరావృతం కాకూడదు. మనం విడిపోతే, మనం నాశనం అవుతాము. మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితం” అని ఆదిత్యనాథ్ అన్నారు.

ఇదిలా ఉంటే, బీజేపీ శ్రేణులు మరో విధమైన భాష్యాన్ని చెబుతున్నాయి. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ కులగణన పేరుతో దేశాన్ని విభజించే కుట్రకు పాల్పడుతున్నాడని, అందుకే హిందువులు సంఘటితంగా ఉండాలని యోగి ‘‘బటేంగే తో కటేంగే’’ నినాదం చెబుతుందని వెల్లడిస్తున్నారు. ఈ నినాదాలు ప్రస్తుతం మహారాష్ట్రలో వైరల్ అవుతున్నాయి. ఆ రాష్ట్రంలోని 288 సీట్లకు నవంబర్ 20న ఎన్నికలు జరగబోతున్నాయి. 23న ఫలితాలు వెలువడుతాయి.