ఎన్నికల ప్రచారంలో వినూత్న వాల్ పోస్టర్లు తెలిసాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క దనబలం అంటూ బిఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రజాబలం అంటూ వెలిసిన పోస్టర్ల జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ములుగు జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సీతక్కకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్కది ధనబలం అంటూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రజాబలం అంటూ రూపొందించిన పోస్టల్ సోషల్ మీడియాలో జిల్లా కేంద్రంలో వైరల్ గా మారాయి.
Also Read : Israel-Hamas War: ఇజ్రాయిల్ చేరుకున్న జో బైడెన్.. హమాస్ ఐసిస్ కన్నా దారుణంగా ప్రవర్తించింది.
నియోజకవర్గంలో మొదటిసారి ఇలాంటి పోస్టర్లు విలువడడం ఇక్కడి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు వెయ్యడం అభ్యర్థులు ఒకరిపై ఒకరు దూకుడు ప్రచారాలు కొనసాగుతున్నాయి. తెల్లవారే సరికి ఈ పోస్టర్ల్ ఎలా వెలిశాయి, ఎవరు అంటించారు అనేదాని పై పలు అనుమానాలు రేకేతిస్తున్నాయి. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి ఓటమి చెందుతుందనే భయంతో అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క పై కావాలనే అధికార పార్టీ నాయకులు పుష్పచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
Also Read : Off The Record: ఆటోమేటిక్‌గా పార్టీ టిక్కెట్ వచ్చేస్తుంది..ఎవరా లీడర్స్? ఏంటా ఓవర్ కాన్ఫిడెన్స్?