NTV Telugu Site icon

Post Card: కాస్త ఆలస్యమైన.. 121 ఏళ్ల తర్వాత చేరాల్సిన చోటుకి చేరిన ఉత్తరం..

Letter

Letter

ఇదివరకు మహా కవి శ్రీశ్రీ ‘నేను ఎక్క వలసిన రైలు ఒక జీవితకాలం లేటు’ అని అన్నారు. అయితే ఆయన ఎందుకు అలా.. ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ… తాజాగా దానిని నిజం చేస్తూ.. ఓ ఉత్తరం పోస్ట్ చేసిన 121 ఏళ్ల తర్వాత చేరాల్సిన చోటుకి చేరుకుంది. ఈ ఉత్తరం రావడం ఆలస్యమైనా.. దాని వల్ల ఓ మంచి పని జరిగింది. బ్రిటన్‌ లో పోస్ట్‌ చేసిన ఉత్తరం 121 ఏళ్ల తర్వాత చేరిన పోస్టుకార్డు వల్ల ఎప్పుడో వందేళ్ల కింద విడిపోయిన 2 కుటుంబాలను కలిపింది. 1903లో ఎవార్ట్‌ అనే బాలుడు తన సోదరి లిడియాకు పంపిన పోస్టు కార్డు ఈ మధ్యనే స్వాన్సీ బిల్డింగ్‌ సొసైటీ క్రాడాక్‌ స్ట్రీట్‌ బ్రాంచ్‌ కు చేరుకుంది. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది. దాంతో వారి కుటుంబాలను వెతికేందుకు సొసైటీ వారు నిశ్చయించుకున్నారు.

Harbhajan Kohli: 10 వేల రన్స్‌ చేయకపోతే సిగ్గుపడాలి.. కోహ్లీతో హర్భజన్‌!

కార్డు గురించి పత్రికల్లో వచ్చిన కథనాలతో ఎవార్ట్, లిడియాల మనవడు నిక్‌ డేవిస్, మనవరాళ్లు హెలెన్‌ రాబర్ట్, మార్గరెట్‌ స్పూనర్, ముని మనవరాలు ఫెయిత్‌ రేనాల్డ్స్‌ వారి బంధాన్ని గుర్తించారు. వీరంత గత నెలలో స్వాన్సీలోని వెస్ట్‌ గ్లామోర్గాన్‌ ఆర్కయివ్స్‌ లో కలుసుకున్నారు. ఎవార్ట్, లిడియా కుటుంబం 121 ఏళ్ల కిందట స్వాన్సీ బిల్డింగ్‌ సొసైటీలో జీవించేది. ఇకపోతే ఆరుగురు తోబుట్టువుల్లో లిడియా పెద్దది. తమ్ముడైన ఎవార్ట్‌ ఆమెకు పోస్టు కార్డు రాశాడు. వీరికి స్టాన్లీ అనే తమ్ముడు ఉన్నాడు. ఆయన మనవరాళ్లే 58 ఏళ్ల హెలెన్‌ రాబర్ట్‌, 61 ఏళ్ల మార్గరెట్‌ స్పూనర్‌. వెస్ట్‌ ససెక్స్‌కు చెందిన 65 నిక్‌ డేవిస్‌… ఎవార్ట్‌ మనవడు. డెవాన్‌ కు చెందిన 47 ఏళ్ల ఫెయిత్‌ రేనాల్డ్స్‌ లిడియా ముని మనవరాలు. తామంతా కలిసినందుకు లిడియా, ఎవార్ట్, స్టాన్లీ పైనుంచి చూసి సంతోషిస్తూ ఉంటారని వారు అభిప్రాయం పడ్డారు. రెండు కుటుంబాలను ఏకం చేసిన వందేళ్ల నాటి పోస్టును తిరిగి ఆర్కైవ్స్‌ లోనే ఉంచాలని వారు నిరన్యం తీసుకున్నారు.

Rohit Sharma: రోహిత్ శర్మతో నాకు అంతగా ఇంటరాక్షన్‌ లేదు: ఫీల్డింగ్‌ కోచ్‌

ఈ పోస్టు కార్డు రాసినప్పుడు ఎవార్ట్‌ వయసు 13 ఏళ్లు. వేసవి సెలవుల్లో ఫిష్‌ గార్డ్‌ లోని తన తాత ఇంట్లో జీవించేవాడు. పెద్ద సోదరి లిడియాకు పోస్టు కార్డులు సేకరించే అభిరుచి ఉండేది. అద్భుతంగా కనిపించిన ఓ పోస్టు కార్డును తన సోదరికి పంపించాడని ఎవార్ట్‌ మనవడు నిక్‌ డేవిస్‌ అప్పటి విషయాలను పంచుకున్నాడు. కార్డు కారణంగా ఇలా బంధువులను కలవడాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. స్టాన్లీ మనవరాళ్లు హెలెన్, స్పూనర్‌ గత ఆరేళ్లుగా తమ కుటుంబ వృక్షాన్ని నిర్మిస్తున్నారు. ఇలాంటి కుటుంబ సభ్యులున్నారని ఇన్నాళ్లూ తెలియకపోవడం వారిని భావోద్వేగానికి గురిచేసిందని తెలిపారు. అప్పుడు వాళ్లున్న ఇంట్లోని వస్తువులను వేలానికి పంపినప్పుడు ఆ పోస్టు కార్డు బహుశా బైబిల్‌ లోంచి పడిపోయి ఉంటుందని., ఆ తరవాత ఎవరో దాన్ని తిరిగి పోస్టాఫీసుకు పంపి ఉంటారని వారు అనుకుంటున్నారు. ఈ సృష్టిలో ఏదీ ఊరకే జరగదని., దాని వెనక ఏదో పరమార్ధం ఉంటుందని ఈ ఉత్తరం మరోసారి రుజువు చేసిందని అంటున్నారు.

Show comments