NTV Telugu Site icon

Shubman Gill: ఓటమి బాధ నుంచి కోలుకోని టీమిండియా ఆటగాళ్లు.. 16 గంటలు గడిచాయని పోస్ట్

Gill

Gill

ప్రపంచకప్‌ ఫైనల్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమి కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల హృదయాలను కొల్ల గొట్టింది. అంతేకాకుండా ఆటగాళ్ల ముఖాల్లో ఇప్పటివరకు ఓటమి బాధ పోవడంలేదు. అయితే టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో ఓటమి బాధను వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్‌లో భారత ఆటగాళ్లందరూ ఉన్నారు.

Kidnap: మధ్యప్రదేశ్లో దారుణం.. అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్

తన పోస్ట్ లో.. ‘దాదాపు 16 గంటలు గడిచిపోయాయని, ఇదంతా నిన్న రాత్రి జరిగిందని శుభ్‌మన్ గిల్ క్యాప్షన్‌లో రాశారు. ఈ అద్భుతమైన ప్రయాణంలో.. మా బృందం గొప్ప స్ఫూర్తిని, అంకితభావాన్ని ప్రదర్శించింది’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా.. ‘మా అభిమానులు మాకు చాలా మద్దతు ఇచ్చారు, మేము గెలిచినా.. ఓడిపోయినా, మీ మద్దతు చాలా ఉందని శుభమాన్ గిల్ రాశారు. ఈ ఓటమితోనే అన్నీ పోలేదు… జై హింద్’. అంటూ ముగించాడు.

Atrocious: ఆవేశంలో అత్తను చంపిన అల్లుడు..

ఇప్పుడు.. శుభ్‌మన్ గిల్ పోస్ట్ సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. అంతే కాకుండా.. నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. నిజానికి.. ఈ ప్రపంచకప్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసినా.. ఫైనల్ మ్యాచ్‌లో 7 బంతుల్లో 4 పరుగులు చేశాడు.