Site icon NTV Telugu

FIFA World Cup: పోర్చుగల్‌ గోల్స్ మోత.. ప్రపంచకప్ నుంచి స్విట్జర్లాండ్ నిష్క్రమణ

Fifa World Cup

Fifa World Cup

FIFA World Cup: ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ గోల్స్‌తో స్విస్‌ జట్టును చిత్తు చేసింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో పోర్చుగల్ 6-1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్‌ను ఓడించగా, గొంకలో రామోస్ హ్యాట్రిక్ సాధించగా, పెపే, రాఫెల్ గెరిరో, రాఫెల్ లియో ఒక్కో గోల్ చేశారు. 21 ఏళ్ల పోర్చుగల్ ఆటగాడు గొంకలో రామోస్ ఏకంగా మూడు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 58వ నిమిషం వద్ద స్విస్ ఆటగాడు మాన్యువల్ అకంజీ గోల్ చేయడంతో స్విట్జర్లాండ్ ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్‌లో స్విస్ తరఫున మాన్యుయెల్ అకంజీ ఏకైక స్కోరర్‌గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ మొరాకోతో తలపడనుంది.

IND vs BAN: బంగ్లాదేశ్‌తో భారత్ చావో రేవో.. మనోళ్లు నెగ్గుతారా?

పోర్చుగల్ ఆటగాళ్లు మరింతగా చెలరేగి దూకుడు ప్రదర్శించి ప్రత్యర్థి జట్టును ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోర్చుగల్ కంటే ఎక్కువ పాస్‌లు అందుకున్నప్పటికీ గోల్స్ చేయడంలో స్విట్జర్లాండ్ ఆటగాళ్లు విఫలమయ్యారు. ఈ ఓటమితో స్విట్జర్లాండ్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. పోర్చుగల్‌ తన తదుపరి మ్యాచ్‌ మాజీ ఛాంపియన్‌ స్పెయిన్‌ను అనూహ్యంగా ఓడించిన మొరాకోతో తలపడనుంది.

Exit mobile version