NTV Telugu Site icon

Sultanganj Aguwani Ghat Bridge: మరోసారి కూలిపోయిన వంతెన..

Bridge

Bridge

Sultanganj Aguwani Ghat Bridge: బీహార్‌ లోని గంగా నదిపై నిర్మిస్తున్న అగువానీ – సుల్తాన్‌ గంజ్ వంతెన ఒక భాగం కుప్పకూలింది. ఇదే వంతెన కూలడం ఇది మూడోసారి. ఇదివరకు వంతెన కొంత భాగం జూన్ 5, 2023, ఏప్రిల్ 9, 2022 న కూలిపోయింది. తాజాగా శనివారం ఉదయం కూడా వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. పదకొండేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. రూ. 1710 కోట్లతో వంతెన నిర్మాణం సాగుతోంది. కాగా, బీహార్‌లో నాలుగు వారాల్లో 15 వంతెనలు కూలిపోయాయి.

Rain Alert: హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్.. ఏడు జిల్లాల్లో భారీ వర్ష సూచన..

అరారియా జిల్లాలోని ఫోర్బెస్‌గంజ్ బ్లాక్‌ లోని అమ్హారా గ్రామం వద్ద పర్మాన్ నదిపై ఉన్న వంతెన కూడా గత రోజు భారీ వరదలకు ధ్వంసమైంది. రాష్ట్రంలో పలుచోట్ల బ్రిడ్జి కూలిన ఘటనలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనలను ఆడిట్ చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది బ్రజేష్ సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.