NTV Telugu Site icon

Devil : ఓటీటీలోకి వచ్చేస్తున్న పూర్ణ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 02 28 At 2.18.35 Pm

Whatsapp Image 2024 02 28 At 2.18.35 Pm

టాలీవుడ్ బ్యూటీ పూర్ణ హీరోయిన్‌గా నటించిన హారర్ మూవీ డెవిల్..ఈ మూవీలో పూర్ణతో పాటు మరో టాలీవుడ్ హీరో త్రిగుణ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ లో విదార్థ్ కథానాయకుడిగా నటించాడు. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది.. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ఆథియా దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మిస్కిన్ డెవిల్ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా మిస్కిన్ కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు..డెవిల్ మూవీలో హేమ అనే గృహిణిగా పూర్ణ కనిపించింది. హేమా భర్త అలెక్స్ ఓ ఫేమస్ లాయర్‌.తన ఆఫీస్‌లోనే పనిచేసే సోఫియా అనే అమ్మాయితో రిలేషన్‌షిప్ కొనసాగిస్తుంటాడు. ఓ యాక్సిడెంట్ ద్వారా హేమ జీవితంలోకి రోషన్ వస్తాడు. రోషన్‌, హేమల బంధం గురించి తెలిసి అలెక్స్ ఏం చేశాడు..అన్నదే డెవిల్ మూవీ కథ.

ఈ మూవీలో పూర్ణ నటన బాగున్నా రొటీన్ స్టోరీ కారణంగా డెవిల్ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలచింది. థియేటర్లలో కోటి లోపే వసూళ్లను రాబట్టింది.మిస్కిన్ సినిమాలకు ఉన్న క్రేజ్ కారణంగా రిలీజ్‌కు ముందు డెవిల్‌పై కోలీవుడ్ ఆడియెన్స్‌లో భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.కానీ ఈ మూవీ ఆడియెన్స్‌ను పూర్తిగా డిసపాయింట్ చేసింది. డెవిల్ మూవీ డైరెక్టర్ ఆథియా మిస్కిన్ సోదరుడు కావడం విశేషం.డెవిల్ సినిమాకు మ్యూజిక్ అందిస్తూనే ఇందులో గెస్ట్ రోల్‌లో మిస్కిన్ కనిపించాడు.డెవిల్ మూవీతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత పూర్ణ కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు ఈ సినిమా విజయాన్ని అందించలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మార్చి 1న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతుంది..